హైదరాబాద్, నవంబరు 7: తెలంగాణ పోలింగ్ (Telangana Assembly elections) తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు (Politics) మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రత్యర్ధులపై గెలుపు బావుటా ఎగురవేయడానికి ఆచితూచి ప్రధాన రాజకీయ పార్టీలు (TS Politics)తమ అభ్యర్ధులను బరిలోకి దింపుతున్నాయి. మరికొద్ది రోజుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena Party)తో కలిసి బీజేపీ (BJP)బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ తన మిత్రపక్షమైన జనసేనకు గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గాన్ని కేటాయించింది. బీజేపీలో కొద్దిరోజుల కిందటే చేరిన బిల్డర్స్ అసోసియేషన్ నేత ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ (Mummareddy Premkumar) అనూహ్యంగా జనసేన పార్టీ కండువ పుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా కూకట్పల్లి (Kukatpally MLA Ticket) నుంచి బరిలో దిగుతున్నారు.
Also Read: TDP Buchiram Prasad: ‘పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వైపీసీ మంత్రులు రాజకీయ కేంద్రంగా మారుస్తున్నారు’
ఆయన తొలుత బీజేపీ నుంచి కూకట్పల్లి (Kukatpally) టిక్కెట్టు ఆశించారు. అయితే ఆ స్థానం జనసేనకు కేటాయించింది బీజేపీ. దీంతో ప్రేమ్‌కుమార్ సోమవారమే బీజేపీ నుంచి జనసేన పార్టీ (Janasena Party)లోకి చేరారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గం ఓటు బ్యాంకు ఉండడంతో ఆయనకు జనసేన తరఫు నుంచి టిక్కెట్టు దక్కినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. జనసేన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ తనకు సూచించారని తెలిపారు. ఇప్పటివరకు కూకట్పల్లి, ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్‌కర్నూలు, తాండూరు, వైరా సెగ్మెంట్లు బీజేపీ తమకు కేటాయించిందని జనసేన వర్గాలు మీడియాకు తెలిపాయి. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో సెగ్మెంటు కూడా తమకు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు శేరిలింగంపల్లిలో జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: TDP Bathyala Changal Rayudu: టీడీపీ నేత అచ్చెనాయుడుతో బత్యాల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఎవరీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్..?
ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నగరంలో కాపు సామాజిక వర్గంకి చెందిన బీజేపీ నేత. ప్రేమ్ కుమార్ కాపు కులస్థుడు కావడంతో తాజాగా జనసేన తీర్ధం పుచ్చుకుని ఆ పార్టీలోకి మారారు. దీంతో ఆ పార్టీ ప్రేమ్‌కుమార్‌కు కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారు. కూకట్‌పల్లిలో కాపు సామాజిక వర్గంకు దక్కిన మొదటి ఎమ్మెల్యే టికెట్ ఇదే కావడం విశేషం. అటు కూకట్‌పల్లిలో కూడా కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. దీంతో తెలంగాణలో కూకట్పల్లి నుంచి జనసేన బోణీ కొట్టే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
కాపు సామాజిక వర్గం ప్రేమ్ కుమార్‌కు అండగా ఉంటుంది. ఏపీలో టీడీపీ జనసేన ఒక్కటైయ్యారు కాబట్టి, కూకట్‌పల్లిలో కాపు, కమ్మ ఒక్కటై ప్రేమ్ కుమార్‌ను గెలిపించునే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోతుంది. మొత్తంగా కూకట్పల్లి నుంచి ఈ రెండు సామాజిక వర్గాలతోపాటు బీజేపీ ఓట్లు కూడా ప్రేమ్‌కుమార్‌కు పడే అవకాశం ఉంది. ఇక మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి కూకట్పల్లి వాస్తవ్యుడు కావడం గమనార్హం. కూకట్‌పల్లిలో ఆయన, ఆయన సతీమణి గతంలో కార్పోరేటర్లుగా పనిచేశారు. ఆయన ద్వారా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు కూడా ప్రేమ్ కుమార్ రెడ్డి వైపు నడిస్తే .. ఇక ప్రేమ్ కుమార్ విజయం నల్లేరు మీద నడకలాంటిదే అవుతుంది.
మరిన్ని తాజా తెలంగాణ రాజకీయాల కోసం క్లిక్ చేయండి.
