ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం చేసేందుకు టీడీపీ, జనసేన పోత్తుతో ముందుకు వెళ్తున్నట్టు మొన్నామద్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో 14 రోజుల రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ని కలిసిన పవన్ కళ్యాణ్ పొత్తుపై మీడియా వేదికగా ప్రకటించారు.
ఇక కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు “గాజు గ్లాసు” ను మరోసారి కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమకు గతంలో ఇచ్చిన గుర్తు మళ్లీ కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి పవన్ కళ్యాణ్ కతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ‘ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు “గాజు గ్లాసు” ను మరోసారి కేటాయించిన ఎన్నికల సంఘం..గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం – జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం.’ అంటూ ట్విట్ చేశారు. ఇదిలా ఉంటే.. గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు పైనే పోటీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలోని 137 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేశారు.
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు “గాజు గ్లాస్”
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు “గాజు గ్లాసు” ను మరోసారి కేటాయించిన ఎన్నికల సంఘం
గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం – జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం.#VoteForGlass pic.twitter.com/BG83kvIxQo
— JanaSena Party (@JanaSenaParty) September 19, 2023
