ఎవడినీ వదలవద్దు: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!

అటవీ శాఖ అధికారులపై పవన్ ప్రసంశలు

Share this :
ఆంధ్రప్రదేశ్ అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణ కోసం అటవీశాఖ సిబ్బంది చేసిన అసాధారణ కృషిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ – పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అభినందనలు కురిపించారు. అడవిలో వేటగాళ్లు అమర్చిన ప్రాణాంతక ఉచ్చులు, కరెంట్ తీగలను ముందస్తుగా గుర్తించి తొలగించిన సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు.

Also Read: ముంబై కెప్టెన్ కావాలంటే రోహిత్ ఆశీర్వాదం కావాల్సిందే..?

మారేడుమిల్లి అటవీ పరిధిలో క్రూర జంతువులను, వన్యప్రాణులను వేటాడేందుకు స్మగ్లర్లు, వేటగాళ్లు రహస్యంగా ఏర్పాటు చేసిన 250కి పైగా ఉచ్చులు (Traps), ప్రమాదకరమైన విద్యుత్ తీగలను (Electric wires) అటవీ సిబ్బంది చాకచక్యంగా గుర్తించి తొలగించారు. వేటగాళ్ల నెట్‌వర్క్‌కు ముందే చెక్ పెట్టి, మూగజీవాల ప్రాణాలను కాపాడిన సిబ్బంది సమర్థతను పవన్ కళ్యాణ్ అభినందించారు. అడవుల రక్షణలో క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

Also Read: నీట్ రీ-ఎగ్జామ్ కోసం రంగంలోకి ఆర్మీ..?

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతాల్లోని స్థానిక గిరిజన ప్రజలకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. అనాదిగా అడవితో విడదీయరాని బంధం ఉన్న గిరిజన సోదరులు వన్యప్రాణుల రక్షణకు, అటవీ సంరక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని, అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అడవి బాగుంటేనే పర్యావరణం, మానవ మనుగడ సాధ్యమవుతుందని ఆయన గుర్తుచేశారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లకు, వన్యప్రాణులను పొట్టనబెట్టుకునే వేటగాళ్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అటవీ సంపదకు గానీ, మూగజీవాలకు గానీ హాని తలపెట్టే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి అసాంఘిక శక్తులపై చట్టప్రకారం కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

leave a reply