YCP Samajika Sadhikara Yatra: ‘వైసీపీ సాధికార యాత్రలో న్యాయం లేదు..’ జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్

ఏపీ అధికార పార్టీ తీరుపై జనసేన నేత పసుపులేటి ఫైర్

JanaSena leader Pasupuleti Hariprasad JanaSena leader Pasupuleti Hariprasad
Share this :

తిరుపతి, నవంబర్‌ 2: అధికార పార్టీ వైసీపీ (YSRCP) చేసే సామాజిక సాధికార యాత్ర (YSRCP Samajika Sadhikara Yatra)లో న్యాయం లేదని జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ (Pasupuleti Hariprasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ డిపార్ట్‌మెంట్‌లో చూపినా రెడ్డి పాలన (Reddy Community)కొనసాగుతోందని, రెడ్డి సామాజిక వర్గమే ఏలుతోందని మిగిలిన ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీలు ఏమయ్యారని పసుపులేటి హరిప్రసాద్ ప్రశ్నించారు.

Also Read: Varun Tej-Lavanya Tripathi Wedding Photos: వేద‌మంత్రాల సాక్షిగా ఒక్కటైన వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి.. ఫొటోలు వైరల్

తిరుపతి (Tirupati) ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీ పాలనపై అసహనం వ్యక్తం చేశారు. సాధికారత యాత్ర అంటే అన్ని కులమతాలకు న్యాయం చేసేలా ఉండాలని అన్నారు. కానీ ఇక్కడ ఒకే కులానికి చెందిన వారికే న్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో సామాన్యులు రాజకీయం (Politics) చేయకూడదా అంటూ ప్రశ్నించారు. కానీ జనసేన పార్టీ (Janasena Party) అంటే అన్ని కులాలకు సంబంధించిన పార్టీ అని కొనియాడారు. త్వరలో రాబోయేది జనసేన (Janasena), టీడీపీ (TDP) పాలనని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Telugu Political Feature Film Vyuham: సీనియర్‌ నటి జీవిత రాజశేఖపై ఫిల్మ్‌ బోర్డుకు ఫిర్యాదు.. సెన్సార్‌ సభ్యత్వం నుంచి తొలగించాలంటూ నిర్మాత లేఖ

అనంతరం కిరణ్ రాయల్ మాట్లాడుతూ 1999లో తాను రాయల్ యూత్ (Royal Youth) అని కొందరితో కలిసి స్థాపించామని, తనను చిన్న వయసు నుంచే కిరణ్ రాయల్ (Kiral Kumar) గా పిలిచేవారని అన్నారు. అయితే నేడు వైసీపీలోని బలిజ కులస్థులు రాయల్ అనే బ్రాండ్‌ను వాడుకొని లబ్ధి పొందుతున్నారని అన్నారు. రాయల్ అన్నది పేరు కాదు బ్రాండ్ (Brand) అని, అది తీసుకొచ్చింది మేమేనని దుయ్యబట్టారు. వైసీపీ (YSRCP) దుర్మార్గ పరిపాలన నుంచి ప్రజలు విముక్తులు కానున్నారని, రానున్నది జనసేన టీడీపీ ప్రజా ప్రభుత్వం అని కొనియాడారు.