Telugu Political Feature Film Vyuham: సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌పై ఫిల్మ్‌ బోర్డుకు ఫిర్యాదు.. సెన్సార్‌ సభ్యత్వం నుంచి తొలగించాలంటూ నిర్మాత లేఖ

పొలిటికల్‌ హీట్‌ పెంచేస్తున్న రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం'.. జీవిత స్పందన ఇదే

Film Producer Natti Kumar
Share this :

Vyuham Movie to Censor RC  హైదరాబాద్‌, నవంబర్ 2: సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌ (Actress Jeevitha Rajasekhar)పై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌ (Producer Natti Kumar) సెంట్రల్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెను తాత్కాలికంగా సెన్సార్ ఆర్‌సీ సభ్యత్వం నుంచి తొలగించాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘వ్యూహం’ (Vyuham Movie)సినిమా పూర్తిగా రాజకీయ ఫీచర్‌ సినిమా అని దానిని సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (Central Board of Film Certification) రిజెక్ట్‌ చేసింది. దీంతో సెన్సార్ ఆర్‌సీకి ఈ సినిమాను రిఫర్‌ చేశారు. అయితే సెన్సార్‌ ఆర్‌సీలో సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌ సభ్యులుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గతంలో జీవితరాజశేఖర్‌ వైసీపీ (YSRCP) నేత అయినందువల్ల ఈ సినిమా వరకు ఆమెను సెన్సార్‌ చేయకుండా తొలగించాలంటూ నిర్మాత నట్టి కుమార్‌ సెంట్రల్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ఛైర్మన్‌కు రాసిన ఫిర్యాదు లెటర్‌లో పేర్కొన్నారు. అసలీలొల్లి ఎక్కడ మొదలైందంటే..

పొలిటికల్‌ హీట్‌ పెంచేస్తున్న రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’

సెన్షేషనల్‌ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. ఈ సినిమా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల తెరకెక్కిస్తున్నట్టు వర్మ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు (AP CM YS Jagan) పూర్తిగా అనుకూలంగా, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను వ్యంగ్యంగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), అలాగే జనసేన పార్టీ (Janasena Party) ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, ఇంకా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Ex Prime Minister Manmohan Singh), కాంగ్రెస్‌ (Congress) పార్టీ అధినేత సోనియా గాంధీ (Soniya Gandhi) పాత్రలను వారి పోలికలకు దగ్గరగా ఉన్న నటీనటులను ఎంపిక చేసుకుని మరీ, ఈ సినిమాలో వారి పాత్రలను వ్యంగ్యంగా చూపించారు. తాజాగా విడుదలైన వ్యూహం సినిమా టీజర్‌ చూస్తే ఈ విషయం అవగతమవుతుంది.

Also Read: Attack on Medak MP Kotha Prabhakar Reddy: తెలంగాణ బీఆర్‌ఎస్‌ ఎంపీపై కత్తితో దాడి.. అంబులెన్స్‌లో యశోదకు తరలింపు

‘ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశాం.. ఆమెను వెంటనే తొలగించండి’

ఇక నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ సినిమాను సెన్సార్ కోసం పంపించగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. దీంతో ఈ సినిమాను సెన్సార్ ఆర్‌సీకి (Censor RC) రిఫర్‌ చేశారు. అయితే ఇక్కడ నిర్మాత నట్టి కుమార్‌ అభ్యంతరం తెలుపుతూ సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు ఇచ్చాడు. ఆయన ఫిర్యాదులో ఏముందంటే.. ‘వ్యూహం (Vyuham) సినిమా పూర్తిగా తెలుగు పొలిటికల్‌ ఫీచర్‌ సినిమా (Telugu political Feature Film). ప్రస్తుతం 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగు దేశం పార్టీ చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత, బెయిల్‌పై విడుదలైన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్న సంగతి విధితమే. దీంతో ఈ ఎన్నికల సమయంలో ఈ సినిమాను విడుదల చేసినట్లయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ ఎదురవుతుంది’.

Also Read: Varun Tej-Lavanya Tripathi Wedding Photos: వేద‌మంత్రాల సాక్షిగా ఒక్కటైన వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి.. ఫొటోలు వైరల్

‘మరోవైపు ఈ సినిమాను విడుదల చేయకుండా నిలుపుదల చేయాలని ఎలక్షన్ కమిషన్‌కు కూడా కంప్లైంట్ చేసాం. ప్రస్తుతం సెన్సార్‌ ఆర్‌సీకి ఈ సినిమాను రిఫర్‌ చేసినందున అక్కడ సభ్యురాలిగా కొనసాగుతోన్న నటి జీవితరాజశేఖర్‌ను ఈ సినిమాకు సెన్సార్ చేయడానికి వీలులేకుండా సెన్సార్‌ ఆర్సీ తప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) వైసీపీ (YSRCP) నేత అయినందు వల్ల ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా సెన్సార్ చేయమని సహజంగానే వత్తిడి చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యూహం మూవీని తీసిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా వైసీపీ నేత. ఆయనను వైసీపీ ప్రభుత్వం టీటీడీ (TTD Board) బోర్డు సభ్యుడిగా కూడా నియమించింది. ఈ సినిమా డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ, జీవిత రాజశేఖర్‌, ఆమె రాజశేఖర్‌.. వీరు ముగ్గురూ మంచి స్నేహితులు కూడా. ఈ విషయాలన్నీ పరిగణనలోని తీసుకుని ఆమెను తప్పించాలని’ తన ఫిర్యాదులో నిర్మాత నట్టి కుమార్‌ వివరించారు. దీనిపై నటి జీవితా రాజశేఖర్‌ స్పందించారు.

ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను: జీవితా రాజశేఖర్‌

తాను ప్రస్తుతం బీజేపీ (BJP)లో ఉన్నానని, తనకు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. వ్యూహం అనే సినిమా ఆర్సీకి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తానని, ఇప్పటి వరకైతే తనకు ఆఫీస్ (Censor RC) నుంచి ఎలాంటి ఆదేశాలురాలేదన్నారు. తన గురించి ఇప్పుడెందుకు నిర్మాత నట్టి కుమార్‌ అభ్యంతరం తెలుపుతున్నారో అర్ధం కావడం లేదని జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) చెప్పుకొచ్చారు.