Varun Tej weds Lavanya Tripathi: మెగా ఇంట ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠిల (Actress Lavanya Tripathi)పెళ్లి వేడుక (wedding) ఘనంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా దాదాపు ఆరేళ్ల తమ ప్రేమను (Varun Tej – Lavanya Tripathi Love story) వివాహబంధంగా మార్చుకుందీ జంట. ఇటలీలోని (Italy) టస్కనీలో బుధవారం (నవంబర్ 1వ తేదీన) రాత్రి వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇరుకుటుంబ సభ్యులు, అతికొద్ది సన్నిహితుల సమక్షంలో లావణ్య (Lavanya) మెడలో వరుణ్ (Varun) మూడుముళ్లు వేశాడు. ఇక ఈ వేడుకలో కొణిదెల, అల్లు కుటుంబాలు సందడి చేశాయి. చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నాగబాబు (Naga Babu), రామ్చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun)తో సహా ఇలా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన అగ్ర, యువ హీరోలందరూ ఈ వేడుకల్లో సందడి చేశారు. దీంతో వివాహ వేడుకతో సహా వరుణ్-లావణ్యల కాక్టైల్ (Varun Tej – Lavanya cocktail party), మెహందీ, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకల్లో మెగా కుటుంబానికి చెందిన స్నేహితులు, సినీ సెలట్రిటీలే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్కు ఈ కొత్త జంట రానుంది. సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్ 5న హైదరాబాద్లోని మాదాపూర్ ఎన్- కన్వెన్షన్లో వరుణ్- లావణ్యల రిసెప్షన్ జరగనుంది. వరుణ్-లావణ్యల పెళ్లి సందర్భంగా సోషల్ మీడియాలో #VarunLav హ్యాష్ట్యాగ్ చక్కర్లు కొడుతోంది. మెగా ఫొటోలు మీరూ చూడండి..









3 Comments
Comments are closed.