Prabhas Wedding AI Photos: ‘ప్రభాస్‌కు పెళ్లి అయిపోయిందోచ్‌.. భార్య పిల్లలు కూడా ఉన్నారు’ ఫొటోలు వైరల్‌

అలా కుదరలేదని ఇలా చేసేశారు.. డార్లింగ్‌ ఫ్యాన్స్‌ మామూలు ముదుర్లుకాదుగా

Share this :

టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరని ప్రశ్నిస్తే.. డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas) పేరు ప్రతి ఒక్కరి నోటి వెంట వచ్చేస్తుంది. ప్రభాస్‌ ఎప్పుడెప్పుడు పెళ్లి (Prabhas wedding) చేసుకుంటాడా..? అని తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్‌ ఇండియా అభిమానులు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్‌-అనుష్కల జోడి బాగుంటుందని, వీరిద్దరికి పెళ్లి జరిగితే చూడాలనేది.. రెబల్‌ స్టార్‌ అభిమానులందరి కోరిక. అయితే ఈ విషయం గురించి ప్రభాస్‌ను అడగగా.. చాలా సార్లు మీడియాకు దీనిపై క్లారిటీ ఇచ్చాడు కూడా. అనుష్క తనకు కేవలం ఫ్రెండ్‌ మాత్రమేనని, ఇలా లేనిపోని గాసిప్స్‌ క్రియేట్‌ చేయొద్దని కాస్తగట్టిగానే చెప్పాడు. అయినా డార్లింగ్‌ ఫ్యాన్స్‌ మాత్రం తమ మనస్సుల్లో వీరి పెళ్లి కోరికను చెరిపేయలేకపోతున్నారు. దీంతో ఏఐ టెక్నాలజీతో ప్రభాస్‌-అనుష్కలకు పెళ్లి (Prabhas Wedding photos) చేసేశారు. ఇంకా అర్ధంకాలేదా..? ప్రభాస్‌-అనుష్కలకు పెద్దలు పెళ్లి చేయకుండానే.. టెక్నాలజీ సాయంతో ఫ్యాన్స్‌ పెళ్లి చేసేశారు. అంతేకాదు వీరికి ఓ పాప కూడా పుట్టించారు. ప్రస్తుతం ప్రభాస్‌-అనుష్కల పెళ్లి ఫొటోలు (Prabhas and Anushka Shetty’s ‘wedding photos) సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ (AI) వచ్చిన తర్వాత నెటిజన్లు తమ ఆలోచనలకు జీవం పోస్తున్నారు. ఇప్పటికే వ్యాపార దిగ్గజం ముఖేష్‌ అంబానీ నుంచి క్రికెటర్ల వరకు.. రాజకీయ నాయకుల నుంచి సినిమా సెలబ్రెటీల వరకు తమకు నచ్చిన రీతిలో ఏఐ టెక్నాలజీతో ఫొటోలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్, అనుష్కకు పెళ్ళైతే ఎలా ఉంటుంది? వీరికి పాప పుడితే ఎలా ఉంటుంది? అనే నెటిజన్ల ఆలోచనకు ఏఐ టెక్నాలజి జీవం పోసింది.

ఆలోచన రావడమే ఆలస్యం అన్నట్లు.. ఏఐ ద్వారా ఈ ఇద్దరికీ పెళ్లి చేసి, ఒక బుజ్జి పాపను కూడా పుట్టించేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు కూడా ఏఐ సృష్టించనవే అయినా ప్రభాPrabhas), అనుష్క (Anushka) జంట ఎంత బాగుందో.. నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుండు అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఏ మాటకామాట చెప్పుకోవాలి.. ప్రభాస్‌- అనుష్కల పెళ్లి ఫొటోలు నిజంగానే చూడముచ్చటగా ఉన్నాయి. మీరూ చూసేయండి..

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్‌ తాజా చిత్రం సలార్‌ షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మువీ డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. నిజానికి.. సెప్టెంబర్‌లోనే థియేటర్లలోకి రావాల్సి ఉండగా బెటర్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం పోస్ట్ పోన్ చేసారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా సలార్ ట్రైలర్ విడుదల కానుంది. నవంబర్‌లో రెండో ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు.

వచ్చే ఏడాది వేసవిలో ‘కల్కి’ విడుదలయ్యే అవకాశం ఉంది. నాగ్‌ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉన్నట్లు టాక్‌. సలార్, ప్రాజెక్ట్ కె పూర్తయితే.. ‘మారుతి’ సినిమాపైనే ఫోకస్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ విదేశాల్లో టూర్‌లో ఉన్నారు. 2024 సెకండాఫ్‌లో మారుతి సినిమా విడుదల కానుంది. సలార్ 2 రెండో భాగంగా 2025 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వరుస షూటింగ్‌లతో ప్రభాస్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు.

Also Read: Fact Check: టీవీ9 రజనీకాంత్‌పై నెట్టింట ట్రోలింగ్‌.. ‘దిస్ ఇజ్‌ నాట్ వాస్తవం’