Fact Check TV9: టీవీ9 రజనీకాంత్‌పై నెట్టింట ట్రోలింగ్‌.. ‘దిస్ ఇజ్‌ నాట్ వాస్తవం’

Share this :

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 (TV9) గురించి తెలియని వారుండరు. నిరంతర వార్తా కథనాల ప్రసారంలో టీవీ9కు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ వి. రజనీకాంత్‌ (TV9 Rajinikanth) గురించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఏపీ ఎన్నికల (AP Elections 2024) ప్రచారానికి సంబంధించిన ముఖ్య అంశాలను తన టీంతో రజనీకాంత్‌ చర్చించడం కనిపిస్తోంది. అయితే అది వైపీసీకి సంబంధించిన ఓ నేత పంపిన స్క్రిప్ట్‌ అని, ఆ స్క్రిప్ట్‌ను టీంతో డిస్కస్‌ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అది కాస్తా పెడర్ధాలకు దారితీసేలా మారింది. అయితే అది నిజంకాదంటూ ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే..

Also Read: Mark TV Political Digital Promotion: కేవలం రూ.1/-కే ‘మార్క్‌ టీవీ’ పొలిటికల్‌ డిజిటల్ ప్రొమోషన్‌

ప్రతి రోజూ టీవీ9 న్యూస్‌ ఛానెల్‌లో 7PM ‘బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ ప్రోగ్రాం విత్‌ రాజనీకాంత్‌ (TV9 Big News Big Debate Program With Rajinikanth)’ ప్రసారం అవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే గ్రూప్‌ డిస్కషన్‌కి వెళ్లే ముందు టీవీ 9 రజనీకాంత్‌ తన టీంతో డిస్కస్‌ చేసి, ఆ తర్వాత డిబెట్‌ కండెక్ట్‌ చేస్తుంటారు. ఇది అక్కడి ప్రతి రోజూ కార్యచరణలో భాగం. ఇందుకు సంబంధించిన వీడియోలను టీవీ9 నెట్‌వర్క్‌ పరిధిలోని సభ్యులకు వాట్సప్‌ గ్రూప్‌లలో ప్రతి రోజూ పంపుకుంటూ ఉంటారు. ఇది కూడా అక్కడి కార్యచరణలో భాగమే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో షర్మిల, ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మ ఎన్నికల్లో పోటీ చేసే అంశం బాగుంటుందా? లేదా ఆంధ్రాలో జనసేన మీద సీఎం చేసిన వ్యాఖ్యల అంశంపై చర్చిస్తే బాగుంటుందా? అనే అంశాలలో ఏది ముఖ్యమైనది.. ఏది ఆసక్తి కరంగా ఉంటుంది అనే విషయాలపై తన టీంతో రజనీకాంత్‌ చర్చించడం కనిపిస్తుంది.. వినిపిస్తుంది.

టీవీ9 రజనీకాంత్ తన టీంతో చర్చిస్తున్న వీడియో ఇదే..

Also Read: ‘Yatra 2’ first look: ‘యాత్ర 2’ ఫ‌స్ట్ లుక్ వచ్చేసింది.. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి..’

ఈ ప్రశ్నకు సమాధానంగా ఎదురుగా ఉన్న టీం సభ్యులు ఏపీ రాజకీయాల్లో డైరెక్ట్‌గా పవన్‌ కళ్యాణ్‌ను సీఎం జగన్‌ అటాక్‌ చేశారంటూ, పవన్‌ కళ్యాణ్‌ పొత్తుల నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓట్లను కూడా పవన్‌ అమ్ముకుంటున్నాడని సీఎం చెప్పడం మేజర్‌ ఇష్యూగా ఉందని వారు చెబుతుంటారు. నేషనల్‌, ఇంటర్నేషనల్‌, లోకల్‌ అంటూ పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం చిన్న విషయం కాదంటూ టీం సభ్యులు రజనీకాంత్‌కు వివరిస్తుంటారు. సీఎం జగన్, పవన్‌ కళ్యాణ్‌ వంటి హై ఓల్టేజ్‌ వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి అంటూ.. ఇలా పలు అంశాలపై వారు చర్చించడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ఈ వీడియో బయటికి రావడంతో అదికాస్తా పెడర్ధాలకు దారితీసింది. రజనీకాంత్‌ ముందున్న పేపర్లు వైసీపీ నేత సజ్జల భార్గవ్‌ పంపిన స్క్రిప్ట్‌ అంటూ ఓ రాజకీయ పార్టీ ఈ వీడియో ద్వారా దుష్ర్పచారం ప్రచారం చేస్తోంది. దీంతో సోషల్‌ మీడియాలో టీవీ9 రజనీకాంత్‌పై ట్రోలింగ్‌ జరుగుతోంది. అయితే ‘అది వాస్తవం కాదంటూ.. మా టీం వర్క్‌లో భాగంగా ఇదంతా చర్చించామంటూ’ టీవీ9 రజనీకాంత్‌ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.

‘ఇదీ.. నిజం’ అంటూ టీవీ9 రజనీకాంత్ వివరణ ఇచ్చిన విడియో ఇది..

 

Also Read: Snake in Nutrition Kit: అంగన్‌వాడీల్లో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారంలో పాము కళేబరం..

డిజిటల్‌ మీడియా పుణ్యమా అని ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవడం నెటిజన్లకు కష్టసాధ్యమవుతోంది. తప్పుగా అర్థం చేసుకోవడం.. ప్రతి అంశాన్ని చిలువలువలువలుగా ప్రచారం చేడయం సాధారణమైపోయింది. ఏదైనా వ్యక్తుల గురించి, వ్యవస్థల గురించి వీడియోలు బయటికి వచ్చినప్పుడు నెటిజన్లు ఆలోచించాలి. సంయమనం పాటించాలి. ప్రస్తుతం టీవీ9 రజనీకాంత్‌పై కూడా సోషల్‌ మీడియాలో ఇలాగే తప్పుగా ప్రచారం జరుగుతోంది. నెటిజన్లు ఈ విషయాన్ని గ్రహించాలని వీడియో విడుదల చేశారు.