YS Raja Reddy Marriage: కమ్మ వారితో వైఎస్‌ షర్మిల వియ్యం.. కాబోయే కోడలు ఎవరో తెలుసా?

త్వరలో షర్మిళ కుమారుడు రాజారెడ్డి కులాంతర వివాహం.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు

Share this :

YS Raja Reddy Marriage: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఇంట త్వరలో పెళ్లి బాజలు మోగనున్నాయి. వైఎస్ షర్మిల (YS Sharmila)-అనిల్ కుమార్ (Anil Kumar) దంపతుల కుమారుడు రాజారెడ్డి (YS Raja Reddy) త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లిన రాజారెడ్డికి అక్కడ ప్రియా అట్లూరి (Priya Atluri)తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ప్రియా, రాజా కలిసి ఉన్న ఫోటో (YS Raja Reddy Priya Atluri love marriage) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజారెడ్డి పెళ్లి వార్తల నేపథ్యంలో.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటీ? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు.. అమెరికాలో స్థిరపడ్డ అట్లూరి శ్రీనివాస్, అట్లూరి మాధవి దంపతుల కుమార్తె ప్రియా. అమెరికాలో స్థిరపడ్డ అట్లూరి శ్రీనివాస్, అట్లూరి మాధవి దంపతుల స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా. అట్లూరి శ్రీనివాస్‌ది విజయవాడ కాగా ఆయన భార్య మాధవిది ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిప్రోలు. ఇక వీరి కుమార్తె ప్రియ, వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమించుకుంటున్నారనీ.. త్వరలోనే వీరి వివాహం జరగబోతుందని తెగ ప్రచారం జరుగుతుంది. అయితే షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రియ ఎవరు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కి అట్లూరి శ్రీనివాస్ స్నేహితుడు. బ్రదర్ అనిల్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ పార్టనర్. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్‌కు కన్సల్టెన్సీ సంస్థ కూడా ఉంది. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ… గతంలోనే ఆయన క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు.

వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుంది. అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె ప్రియ.. వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డికి అమెరికాలోనే పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రియ ఎవరు అనే దానిపై పలురకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో… చట్నీస్ రెస్టారెంట్ యజమాని కుమార్తె ప్రియా అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ అది వాస్తవం కాదు. జీడిమెట్ల బస్ డిపో దగ్గర ఉన్న శ్రీ ప్రియ మెస్ యజమానులు ప్రియ మేనమామలు. దీంతో ఇప్పుడు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రియ ఎవరు అనేదానిపై ఒక క్లారిటీ వచ్చినట్లైంది. వీరి ప్రేమకు ఇటు వైఎస్ షర్మిల – అనిల్ కుమార్ దంపతులు, అటు ప్రియా అట్లూరి కుటుంబసభ్యులు అంగీకారం తెలిపినట్లు సమాచారం. వచ్చే ఏడాది మే నెలలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతులు అమెరికా నుంచి ఇండియాకు రానున్నారు. తర్వాత వీరి పెళ్లి ముహూర్తం ఎప్పుడు అన్నది తెలిసే అవకాశం ఉంది.

దీంతో వైఎస్ రాజా రెడ్డి – ప్రియా అట్లూరిది కులాంతర వివాహంకానుంది. వైఎస్ షర్మిలది కూడా కులాంతర వివాహమేనన్న సంగతి తెలిసిందే. ఆమె భర్త అనిల్ కుమార్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.