Telangana Crime News: కళ్ల ముందే భార్య ఆత్మహత్య.. ఆమెను రెచ్చకొడుతూ వీడియో తీసిన భర్త

మద్యం మత్తులో భర్త శాడిజం.. అనాథలైన చిన్నారులు

Share this :

Telangana Crime News హైదరాబాద్, డిసెంబర్‌ 13: భార్యా, భర్తల మధ్య మనస్పర్ధలు రావడం సాదారణమే. కొన్నాళ్లకు గొడవలు సర్దుమనిగి దంపతులు కలిసిపోతుంటారు. అయితే కొన్ని గొడవలు ఆత్మహత్యల (suicide) వరకు వెళ్తుంటాయి. అలాంటి ఘటనలే తాజాగా హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో వెలుగు చూసింది. వ్యసనాలకు బానిపైన భర్త (Husband)ను మద్యం (Alcohol) మానెయ్యమని భార్య పలుమార్లు బ్రతిమిలాడింది. అతను వినకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. మనసు కరిగి వచ్చి తనను కాపాడుతాడులే అనుకుంది ఆ ఇల్లాలు. కానీ అలా జరగలేదు. కళ్ల ముందే భార్య ఉరి వేసుకుంటుంటే నీచుడైన భర్త ఫోన్‌లో వీడియో (Video) తీయసాగాడే గానీ భార్యను కాపాడే ప్రయత్నం చేయలేదు. చివరికి భార్య చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మురాద్‌నగర్‌ సయ్యద్‌ అలీగూడలో నివసించే రసూల్‌, అర్షియా బేగం దంపతులకు ఐదేండ్ల క్రితం వివాహం జరిగింది. అయితే రసూల్‌కు అదివరకే వివాహం కాగా.. ఆ విషయాన్ని దాచి అర్షియాను కూడా పెళ్లి చేసుకున్నాడు. దీనికితోడు అతడికి మద్యం అలవాటు కూడా ఉండటంతో వీరిద్దరి మధ్య దాదాపు ప్రతిరోజు గొడవలు జరిగేవి. భర్త చేష్టలవల్ల విసిగిపోయిన అర్షియా మద్యం అలవాటు మానుకోవాలని, లేకుంటే ఉరిపోసుకుంటానని బెదిరించసాగింది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి వీరిద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది.

భర్త వేధింపులు తళలేక, ఆత్మహత్యే శరణ్యమని భావించిన అర్షియా భర్త కళ్ల ముందే ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రసూల్‌.. ఆమెను మరింత రెచ్చగొడుతూ సెల్‌ఫోన్‌తో వీడియో తీయడం ప్రారంభించాడు. అన్నంత పని చేసిన అర్షియా తనవు చాలించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. అర్షియా మరణానికి రసూల్‌ కారణం కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. దీంతో రసూల్‌-అర్షియా దంపతుల ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఈ ఘటన స్థానికులను కలచి వేస్తుంది.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.