తాజా వార్తలు

TeDMA: తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆవిర్భావం

ది సేవియర్ ఆఫ్ డిజిటల్ ఇండస్ట్రీ

Share this :

టెడ్మా ది సేవియర్ ఆఫ్ డిజిటల్ ఇండస్ట్రీ

హైదరాబాద్: సామాన్యుడి సంక్షేమం కోసం అనుక్షణం ఓ రక్షకుడిలా కదిలే పాత్రికేయం మెయిన్ స్ట్రీం మీడియాగా ఎంతో ఎదిగింది .. బడుగుజీవి రక్షణలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది.. ఆ అక్షరాయుధం ఇపుడు డిజిటల్ రూపంలోకి తన రూపాన్ని మార్చుకుని జనసామాన్యంలోకి రాకెట్‌లా దూసుకుపోతోంది.. మారుమూల పల్లె నుంచి అగ్రరాజ్యంలో చోటు చేసుకునే పరిణామాలను ఆడియో విజువల్ రూపంలోకి మార్చి అద్బుతంగా జనానికి అందిస్తోంది.. ఈ అద్భుత అక్షర చైతన్యాన్ని అందిపుచ్చుకుని.. అనన్యమయిన కంటెంట్‌ను విభిన్నమయిన రీతిలో అందిస్తున్న తెలుగు డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలకు అండగా నిలిచేందుకు.. వారి అభ్యున్నతికి చక్కటి బాటలు వేసే లక్ష్యంతో ఉద్భవించింది తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్..TeDMA , ఇది ఓ శుభపరిణామం ..

మీడియా రంగంలో లబ్ధ ప్రతిష్టులుగా నిలిచి .. గత దశాబ్ద కాలంగా డిజిటల్ మీడియా రంగం లోతుపాతులను దగ్గరగా గమనించి
వర్దమాన కంటెంట్‌ రైటర్లకు.. ఇప్పటికే ఆ రంగంలో తమ ప్రతిభాపాఠవాలు చూపుతున్న ఇన్‌ఫ్లూయన్సర్లతో కలసి పనిచేస్తూ వారిలోని ప్రతిభాపాఠవాలు మరింతగా మెరుగులు దిద్దాలన్న మంచి సంకల్పంతో ఆవిర్భవించిన TeDMA.. డిజిటల్ ఏజెన్సీలు,ఛానెల్స్ ఓనర్స్  కంటెంట్ రైటర్ల, వీడియో ఎడిటర్స్, SEO’s , కెమెరామెన్స్, యాంకర్స్, న్యూస్ ప్రెజెంటర్స్ మధ్య అనుసంధానంగా నిలవబోతోంది.. ఓ మార్గదర్శిగా పనిచేయబోతోంది.

పల్లె కావొచ్చు పట్టణం కావొచ్చు నగరం కావొచ్చు ..మరో దేశం కావొచ్చు .. సగటు మనిషి జీవన ప్రమాణాలను , చైతన్యాన్ని పెంచగలిగే ఓ గొప్ప ఆయుధంగా కదులుతున్న డిజిటల్ మీడియా రంగంలో జవాబుదారి తనాన్ని పెంచడం , పరస్పర సహకార వాతావరణాన్ని
పెంపొందిచడం టెడ్మా మొట్టమొదటి లక్ష్యం .. తెలుగు డిజిటల్ కంటెంట్‌ను పదిమంది మెచ్చేంతగా తీర్చిదిద్దడం అన్నది
మరో సంకల్పం .. కంటెంట్ సృష్టికర్తలు అందజేసిన అంశాల్లో లోటు పాట్లను సవరించే దిశగా సలహాలు సూచనలు అందచేస్తూ ప్రేక్షకుడికి నచ్చే కంటెంట్‌ను ఎలా తయారు చేయాలన్నదానిమీద క్రియేటర్లకు ఓ చుక్కానిలా నిలవాలన్నదే టెడ్మా ప్రధాన ఉద్దేశం
ఈ లక్ష్యం సాకారమయితే ప్రేక్షకుడికి కంటెంట్ క్రియేటర్‌కు మధ్య చక్కటి బంధం ఏర్పడుతుంది.. వ్యూయర్‌కు కంటెంట్ పట్ల విశ్వసనీయత ఒనగూరుతుంది.. ఇది ఎలా సాధించాలి..? ఎలా విజయపధంలో నడవాలి..? కంటెంట్‌ను క్రియేటివ్‌గా ఎలా మలచాలి ..? అన్న అంశాల మీద చక్కటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం అన్నది టెడ్మా చేపట్టనున్న కార్యక్రమాల్లో ఓ ప్రధాన భాగం .. కంటెంట్ నాణ్యంగా ఉండగలగాలి ..నైతిక విలువల గట్టు దాటకుండా చూసుకోవాలి .. అందుకు మార్గదర్శిగా నిలవడమే టెడ్మా నమ్మే సిద్దాంతం.. జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు డిజిటల్ కంటెంట్‌కు విస్తృత గుర్తింపు తెచ్చేదిశగా టెడ్మా తన దృష్టి సారిస్తోంది.

చక్కటి కంటెంట్ సృష్టించడమే కాదు .. దాన్ని యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం లాంటి సోషల్ మీడియా వేదికలకు అందించడానికి కావాల్సిన సాంకేతికత గురించి క్రియేటర్లకు అవగాహన కల్పించే బాధ్యతను టెడ్మా చేపట్టబోతోంది ..
అది వార్తాంశమయినా , వినోదాన్నందించే అంశమయినా , విజ్ఞానాన్ని ప్రభోదించే అక్షర మాలిక అయినా వాటిని ఎవరు ఉపయోగించుకోగలరన్నది గుర్తించి .. ఆ అక్షర శిల్పులకు, ఆయా సంస్థలకు మద్య వారధిలా నిలవబోతోంది టెడ్మా ..
ఈ సమాచార మార్పిడి .. సత్తా ఉన్న కంటెంట్ రైటర్లకు వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరమున్న సంస్థలకు మద్య
వారధిలా నిలుస్తుంది.. , తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు డిజిటల్ కంటెంట్ నాణ్యత, రీచ్ మరియు ప్రభావాన్ని మెరుగుపరచడానికి అంకితమైన ఒక మార్గదర్శక సంస్థ. దాని కార్యక్రమాల ద్వారా, తెలుగు మాట్లాడే సమాజంలో డిజిటల్ సృష్టికర్తల పెరుగుదల దాంతో పాటు వారి విజయానికి మద్దతు ఇచ్చే శక్తివంతమైన వ్యవస్థను సృష్టించడమే లక్ష్యంగా అడుగులేస్తోంది TeDMA .

టెడ్మా వ్యవస్థాపక సభ్యులు డిజిటల్ కంటెంట్ సృష్టి, వినోదం మరియు మీడియాలో విస్తృతమైన అనుభవం కలిగిన నిపుణుల సమూహం. వీరి కృషి కేవలం కంటెంట్‌ స్దాయిని పెంచడమే కాదు .. కంటెంట్‌ రైటర్ల సంక్షేమంతో పాటు , డిజిటల్ మీడియా రంగంలో వారి అవగాహన పెంచే శిక్షణ నివ్వడం, ఆరోగ్యసంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం, ప్రతిభ ఉండి వెలుగులోకి రాని వీడియో ఎడిటర్స్, SEO’s , కెమెరామెన్స్, యాంకర్స్, న్యూస్ ప్రెజెంటర్స్, కంటెంట్ రైటర్లను గుర్తించి.. వారిని ఉపయోగించుకునే సంస్థలకు పరిచయం చేయడం లాంటి కార్యక్రమాలను కూడ చేపట్టనుంది ..డిజిటల్ మీడియా రంగంలో ఉపాధి అందించే సంస్థలకు , ఉపాధిని కోరుకునే వారికి మద్య అనుసంధాన వ్యవస్థగా నిలవబోతోంది.. రోజు రోజుకు కొత్త కొత్త పుంతలు తొక్కుతూ.. దశాబ్దాల నుంచి వేళ్లూనుకున్న మెయిన్ స్ట్రీం మీడియాతో సమానంగా కదులుతూ.. సమాచార రంగంలో విప్లవాత్మకమయిన మార్పులను, అభివృద్దిని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్న సోషల్ మీడియాకు ఓ దిశానిర్దేశంగా నిలువబోతోంది .. TeDMA తెలుగు డిజిటల్ మీడియా ఆసోసియేషన్ .. ది సేవియర్ ఆఫ్ తెలుగు డిజిటల్ మీడియా ఇండస్ట్రీ ..