భారత వాతావరణ శాఖ (IMD) దేశవ్యాప్తంగా వర్షపాతానికి సంబంధించి అత్యంత ఆందోళనకరమైన సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది దేశంలో తీవ్ర కరువు ముప్పు పొంచి ఉందని, నైరుతి ఋతుపవనాల (Southwest Monsoon) వర్షపాత అంచనాలను భారీగా తగ్గిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారికంగా స్పష్టం చేసింది. ఈసారి దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసి, కరువు పరిస్థితులు ఏర్పడేందుకు ఏకంగా 60 శాతం అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడం వ్యవసాయ రంగాన్ని తీవ్ర కలవరపెడుతోంది.
Also Read: ఎవడినీ వదలవద్దు: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఐఎండీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. రాబోయే ‘జూన్ – సెప్టెంబర్’ సీజన్లో సాధారణ వర్షపాతంలో కేవలం 90 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే, 2015 తర్వాత దేశంలోనే అత్యంత పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరంగా 2026 నిలవబోతోంది. గత 2024, 2025 సంవత్సరాల్లో వరుసగా పడిన భారీ వర్షాల వల్ల జలాశయాలు నిండినప్పటికీ, ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితి రివర్స్ కాబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారత ఋతుపవనాలను ఈ స్థాయిలో దెబ్బతీస్తున్న ప్రధాన శక్తే పసిఫిక్ మహాసముద్రంలో పుడుతున్న ‘ఎల్నినో’ (El Nino). జూన్ నెలలోనే ప్రారంభం కాబోతున్న ఈ ఎల్నినో ప్రభావం.. పంటలు చేతికి వచ్చే సెప్టెంబర్ నాటికి మరింత బలపడనుంది. సాధారణంగా ఎల్నినో ముప్పు ఉన్నప్పుడు హిందూ మహాసముద్రంలో వచ్చే మార్పులు (Positive IOD) భారతదేశాన్ని కాపాడుతుంటాయి. కానీ ఈ ఏడాది ‘ఇండియన్ ఓషన్ డైపోల్’ (IOD) పూర్తిగా తటస్థంగా (Neutral) ఉంది. అంటే ఎల్నినో సృష్టించే కరువు నుండి దేశాన్ని కాపాడటానికి హిందూ మహాసముద్రం వైపు నుండి ఎలాంటి రక్షణ వలయం లేదు.
Also Read: మైనింగ్ అక్రమాలపై రేవంత్ ఫోకస్..? విజిలెన్స్ నివేదికతో..!
