Warangal Accident Video: సీఐ కొడుకు ర్యాష్‌ డ్రైవింగ్‌.. సెకన్లలో మహిళ మృతి! వీడియో వైరల్‌

పోలీసులు పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కిన మృతురాలి బంధువులు

Share this :

Warangal Accident Video హనుమకొండ, డిసెంబర్‌ 1: అతివేగంతో కారు నడిపిన సీఐ (CI) కొడుకు ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఈ దారుణ సంఘటన హనుమకొండ (Hanumakonda) ఫాతిమానగర్‌లోని సెయింట్ గాబ్రియల్ స్కూల్ (St Gabriel School) సమీపంలో జరిగింది. గురువారం ఉదయం తన బర్తతో కలిసి వచ్చి ఓటువేసిన కవిత అనే మహిళ రోడ్డు ప్రమాదం (Road Accident)లో తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయింది. నిర్లక్ష్యంతో కారు (Car) నడిపి మహిళా (Woman) ప్రాణాలు ఎక్సైజ్ సీఐ (Excise CI) కొడుకు మింగేశాడు. మహిళ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులు (Police) పట్టించుకోక పోవడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అసలేం జరిగిందంటే..

ఫాతిమానగర్ ప్రాంతానికి చెందిన కవిత అనే మహిళ హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తుంది. గురువారం తన భర్తతో కలిసి వచ్చి ఓటువేసిన మహిళా రోడ్డుపక్కన పార్కింగ్ చేసిన తన బర్త బైక్ పై కూర్చోవడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా అదే సమయానికి రోడ్డుపై అతివేగంగా వచ్చిన కారు ఆమెను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్‌కు కారణమైన కారు TS03FA9881 నెంబర్. కారు నెంబర్‌ ఆధారంగా వాకబు చేయగా అది శరత్ అనే ఎక్సైజ్ CI కి చెందినదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో అతని కొడుకు వంశీభార్గవ్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు.

ప్రమాదం దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. కానీ ప్రమాదానికి కారకుడైన యువకుడిని మాత్రం పోలీసులు అరెస్ట్‌ చేయలేదు. కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మృతురాలి బంధువులు ఆగ్రహం చెందారు.

ఖాకీ డ్రెస్‌పై మమకారం చూపారని మృతురాలి బంధువులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పోలీసులు పక్షపాత వైఖరిపై నిరసన తెలిపారు. దీంతో ఖాజీపేట చౌరస్తాలో ధర్నా చేపట్టిన మృతురాలి బందువులు కాజీపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.