Gottimukkala Venteswara Rao Kukatpally BRS Rebel: కూకట్‌పల్లి BRS రెబల్ అభ్యర్థిగా గొట్టిముక్కల.. మారుతున్న రాజకీయ సమీకరణాలు

ఈసారి ఆ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు కష్టకాలమే

Gottimukkala Venteswara Rao BRS Rebel in Kukatpally Gottimukkala Venteswara Rao BRS Rebel in Kukatpally
Share this :

కూకట్‌పల్లి, అక్టోబర్‌ 29: తెలంగాణలో ఎన్నికల (Telangana Elections 2024) సందడి జోరందుకుంది. ప్రధాన పార్టీల్లో అభ్యర్ధలకు టికెట్ల కేటాయింపులు రసవత్తరంగా మారాయి. అలకలు, బుజ్జగింపుల నడుమ కొందరునేతలు టికెట్‌ ఇవ్వకుంటే రెబల్ అభ్యర్ధిగా బరిలో దిగుతామని ఛాలెంజ్‌లు విసురుతున్నారు. తాజాగా తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్​ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్న క్రమంలో కూకట్​పల్లి బీఆర్​ఎస్ (Kukatpally BRS)​ పార్టీలో కొత్త లొల్లి షురూ అయ్యింది. కూకట్​పల్లి నియోజకవర్గం టికెట్‌ ఆశించిన గొట్టిముక్కల వెంటేశ్వరరావు (Gottimukkala Venteswara Rao)కు అధిష్టానం ఈ సారి కూడా మొండిచేయి చూపింది. దీంతో 2009 నుంచి బీఆర్​ఎస్​ పార్టీని నమ్ముకుని ఉన్న గొట్టిముక్కల వెంకటేశ్వర్​ రావును కాదని సిట్టింగ్​ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకే టికెట్​ ప్రకటించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తాను రెబెల్ (BRS Rebel Gottumukkala Venkateswar Rao)​ అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్టు గొట్టిముక్కల ప్రకటించడం కూకట్​పల్లి (Kukatpally) రాజకీయాలు చర్చణీయాంశంగా మారాయి. ఈ పరిణామం బీఆర్‌ఎస్‌ (BRS)కు కొత్త కష్టాలు తెచ్చిపెడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Actress Amala Paul 2nd Marriage: రెండోపెళ్లికి సిద్ధమైన స్టార్‌ హీరోయిన్‌.. బాయ్‌ఫ్రెండ్‌ రొమాంటిక్‌ ప్రపోజల్‌ వీడియో చూశారా?

బీఆర్‌ఎస్‌కు కష్టకాలమేనా..?

ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్​ (Chandrababu Naidu Arrest) సందర్భంగా బీఆర్​ఎస్​ పార్టీ (BRS) మౌనం వహించడంతోపాటు తెలంగాణలో ఆందోళనలు అవసరమా? అంటు మంత్రి కేటీఆర్​ అన్నమాటలు కమ్మ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతే కాకుండా కాంగ్రెస్ (Congress)​ పార్టీకి తమ మద్దతు ఇస్తున్నట్టు కమ్మ సంఘం ప్రకటించింది కూడా. మరో వైపు గ్రేటర్​ ఎన్నికల నుంచి బీజేపీ (BJP) పార్టీ.. కర్ణాటక ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పార్టీలు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ (Janasena Party) సైతం పోటీలో ఉంటున్నట్టు ప్రకటించింది. వీటన్నింటి నడుమ ఈసారి బీఆర్‌ఎస్‌ గట్టెక్కడం ఓ డౌటనుమానంగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

ఈ క్రమంలో బీఆర్​ఎస్ రెబెల్​గా గొట్టిముక్కల వెంకటేశ్వర్​ రావు (Gottimukkala Venteswara Rao) బరిలో దిగడమేకాకుండా.. తన మద్దతుదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ముమ్మర ప్రచారాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రధానంగా యువతను ఎన్నికల్లో తన వైపు తిప్పేందుకు యూత్​ ఇంటరాక్షన్​ కార్యక్రమాన్ని చేపట్టి వేలాది మంది యువత మద్దతును కూడబెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా బీఆర్​ఎస్​ పార్టీలో అసంతృప్తి పరులను ఏకం చేస్తు వారి మద్దతును కూడబెట్టుకునే పనిలో పడ్డాడు. ఇక నవంబర్​ రెండో (November 2nd week) వారంలో బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్ధిగా నామినేషన్​కు గొట్టిముక్కల అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Also Read: Rajasthan Land Dispute Murder: దారుణ ఘటన.. ట్రాక్టర్‌తో 8 సార్లు తొక్కించి సోదరుడి హత్య! వీడియో వైరల్

అసలు ఎవరీ గొట్టి ముక్కల వెంటేశ్వరరావు..

2009లో జీహెచ్​ఎంసీ (GHMC) ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ నుంచి కార్పొరేటర్​గా పోటీ చేసిన గొట్టిముక్కల వెంకటేశ్వర్​ రావు ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత తన అన్న గొట్టిముక్కల పద్మారావుతో కలిసి టీఆర్​ఎస్​ పార్టీలో చేరారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్​ఎస్​ (TRS) అభ్యర్థిగా బరిలో దిగిన తన అన్న గొట్టిముక్కల పద్మారావుకు మద్దతు ఇచ్చి ఒళ్లుదాచుకోకుండా పనిచేశాడు. టీడీపీ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలయ్యాడు. అయితే టీఆర్​ఎస్​ పార్టీని కూకట్​పల్లి (Kukatpally)లో బలమైన పార్టీగా నిలపడంలో గొట్టిముక్కల అవిశ్రాంతంగా కృషి చేశాడనే చెప్పాలి. ఆ తర్వాత నుంచి కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటు పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యాడు. గొట్టిముక్కల కూకట్​పల్లి నివాసి కావడంతో ఆ నియోజకవర్గం ప్రజల్లో గట్టి పట్టు సాధించాడు.

కూకట్‌పల్లి నియోజకర వర్గంలో పట్టున్న అభ్యర్ధే

ప్రజా ఆదరణ కూడా ఎక్కువగానే ఉంది. 2019 ఎన్నికల సమయంలో బీఆర్​ఎస్ పార్టీ టికెట్ (BRS MLA Ticket)​ ఆశించినప్పటికీ అధిష్టానం టికెట్​ కేటాయించక పోవడంతో గొట్టిముక్కల వేలాది మంది అనుచరులు, కార్యకర్తలతో భారీ పాదయాత్ర నిర్వహించారు. దీంతో పార్టీ పెద్దలు గొట్టిముక్కల​ను సముదాయించి పాదయాత్రను విరమించేలా చేశారు. ఈ సారి కూడా అధిష్టానం టికెట్‌ ఇవ్వకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి లోనైన గొట్టిముక్కల రెబల్‌ (BRS Rebel Gottumukkala Venkateswar Rao)గా కూకట్‌పల్లిలో బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు.

అదే జరిగితే బీఆర్​ఎస్​ పార్టీ ఓట్లు చీలి పోయే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు టీడీపీ (TDP) అభిమానులు బీఆర్​ఎస్​ (BRS)కు మద్దతు నిరాకరించి బదులుగా మాంచి ఊపుమీదున్న కాంగ్రెస్​ (Congress) పార్టీ నుంచి రేవంత్ రెడ్డికి ఇస్తున్నట్టు సమాచారం. బీజేపీ, జనసేన పొత్తులో పోటీ చేస్తున్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో బీఆర్​ఎస్​ పార్టీలో గొట్టిముక్కలకు స్థానం కల్పించకుంటే బీఆర్​ఎస్​ అభ్యర్థికి కష్ట కాలమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: Pawan Kalyan Shake Hand to Kodali Nani: ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తోన్న నాని-పవన్‌ షేక్‌ హ్యండ్‌.. జనసైనికుల ఆగ్రహం! వీడియో వైరల్