YSRCP Targets Pawan Kalyan అమరావతి, డిసెంబర్ 15: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Elections 20224)పై చర్చ సాగుతోంది. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ వైసీపీ (YSRCP Targets Pawan Kalyan)తోపాటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన పార్టీ (Jana Sena Party)లు కలిపి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు కూడా. రాష్ట్రంలో ఇప్పటి వరకూ చేపట్టిన సంక్షేమ పథకాలు మళ్లీ అధికారంలో నిలబెడతాయని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ (Pawan Kalyan) అంచనా వేస్తున్నారు. మరోవైపు జాతీయ పార్టీలు బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) కూడా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో ఎన్నికల నోటిఫికేషన్ మార్చ్ 10వ తేదీన విడుదలైంది. మేలో ఎన్నికలు జరిగాయి. ఈ సారి మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలోనే నోటిఫికేషన్ వస్తే మార్చి, ఏప్రిల్ లో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసేటట్లు షెడ్యూల్ కూడా విడుదల చేశారు.
ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఇప్పటికే వ్యూహాలను అమలులో పెడుతోంది. అనుకూల సోషల్ మీడియాల్లో జోరుగా ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Jana Sena Party (JSP) president Pawan Kalyan)పై అస్త్రాలు సందిస్తోంది. ‘ఐడ్రీమ్ మీడియా (iDream Media)’ అనే యూట్యూబ్ ఛానెల్ గతంలో పవన్ ఇచ్చిన వీడియోలకు హెడ్డింగ్‌లు మార్చి, ఆయన పరమతి దిగజార్చేలా ప్రచారం చేస్తోంది. సదరు ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ..

‘ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. ఉద్యోగంలోకి వెళ్దామంటే అన్నయ్య మంచి స్థానంలో ఉన్నారు. దేనికీ సరిగ్గాలేననే ఒక బాధ ఉండేది. అమెరికా వెళ్లాలని ప్లాన్‌చేశాను. కానీ సరైన అకడమిక్ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల వాళ్లు ఛీ కొట్టారు. తర్వాత డైరెక్షన్ కోసమని వెళ్లి, యాక్టింగ్ కూడా నేర్చుకున్నాను. అనుకోకుండా యాక్టర్‌ని అయ్యాను. నేచురల్‌గా నేను యాక్టర్‌ని కాను. యాక్టింగ్‌ని ఎడాప్ట్ చేసుకున్నాను. నేను కానిది కొద్దికొద్దిగా నేర్చుకున్నాను. అందువల్లనే యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని పరిమితులకు లోబడి నా పాత్రలు ఉంటాయి. ప్రతిసారి కష్టంగా ఉంటుంది. అందుకే 20 ఏళ్లలో కేవలం 20 సినిమాలను మాత్రమే చేయగలిగాను. సినిమాలో నచ్చింది చేయలేను. ఏదో ఒకటి చేసిపెడితే కుదరదు. ఈ సంఘర్షణ నన్ను అలసిపోయేలా చేసింది. అందుకే సినిమాలంటేనే అలసట, విసుగొచ్చేసింది. ఈ కారణంగానే నేను పాలిటిక్స్‌లోకి వచ్చాను’ అని అంటారు. ఇంతలో యాంకర్ మాట్లాడుతూ.. ‘మీరు సినిమాలో తప్పనిసరిగా ఉండాలనేది పవన్ ఫ్యాన్‌గా నా రిక్వెస్ట్ అంటుంది.. ఇక ఈ కాన్వర్‌జేషన్‌ని సదరు యూట్యూబ్ ఛానెల్ ‘ఇంటర్ ఫెయిల్ అయ్యా.. యూఎస్ వెళ్దామంటే వాళ్లు ఛీ కొట్టారు’ అని హెడ్డింగ్ మార్చి మళ్లీ బుధవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
గతంలో ఐడ్రీమ్ మీడియకు పవన్ ఇచ్చిన వీడియో ఇదే..
ఎవరీ చిన్న వాసుదేవ రెడ్డి?
ఐడ్రీమ్ మీడియా వ్యవస్థాపకులు చిన్న వాసుదేవ రెడ్డి. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన ఆయన ఆతర్వాత వైఎసీఆర్‌సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఐడ్రీమ్ మీడియా తన యూట్యూబ్ ఛానెల్‌లో గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలను ఇప్పుడు తిరగతోడి, వాటికి వెకిలీ హెడ్డింగ్‌లు మార్చి పవన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రచారం వైసీపీకీ లాభం? జనసేనకు నష్టం చేస్తుందా? అలాగే పవన్ అభిమానులు, జనసైనికులు, కాపు సామాజిక వర్గం ఎలా స్పందిస్తారో చూద్దాం.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
