AP 10th and Inter Exams 2024 విజయవాడ, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ 2023-24 విద్యాసంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లను గురువారం (డిసెంబర్ 14) విడుదల చేసింది. మార్చి ఒకటి నుంచి 30 వరకు టెన్త్ (AP SSC Time Table 2024), ఇంటర్ పరీక్షలు (AP Intermediate Exam Date 2024) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (AP Education Minister Botsa Satyanarayana) తెలిపారు. విజయవాడలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పరీక్షల షెడ్యూలును ప్రకటించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మార్చి 31లోపు పరీక్షలు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. పదోతరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఆయా తేదీల్లో జరుగుతాయి.
ఇక ఇంటర్మీడియట్ మొదటి ఏడాది 5,29,457, రెండో సంవత్సరం పరీక్షలకు 4,76,198 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 1 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నారు. ఎథిక్స్, మానవ విలువల పరీక్ష ఫిబ్రవరి 2, పర్యావరణ విద్య పరీక్ష 3న జరుగుతాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 11 నుంచి 20, వృత్తివిద్య వారికి మార్చి 5 నుంచి 20వరకు రెండు విడతలుగా ఉంటాయని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఒకేషన్ ట్రేడ్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 22 నుంచి నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు ఒకే సారి జరుగుతాయి. ఈ మేరకు మార్చి నెలాఖరు నాటికి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసేలా షెడ్యూల్‌ను రూపొందించినట్లు మంత్రి బొత్స తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు 2024 తేదీలు ఇలా..
- మార్చి 1, 2 తేదీల్లో రెండో భాష-1 , రెండో భాష-2
- మార్చి 4, 5 తేదీల్లో ఆంగ్లం-1, ఆంగ్లం-2
- మార్చి 6, 7 తేదీల్లో గణితం-1ఏ, గణితం-2ఏ, వృక్షశాస్త్రం-1, వృక్షశాస్త్రం-2, సివిక్స్-1, సివిక్స్-2
- మార్చి 9, 11 తేదీల్లో గణితం-1బీ, గణితం-2బీ, జంతుశాస్త్రం-1, జంతుశాస్త్రం-2, చరిత్ర-1, చరిత్ర-2
- మార్చి 12, 13 తేదీల్లో భౌతికశాస్త్రం-1, భౌతికశాస్త్రం-2, ఆర్థిక శాస్త్రం-1, ఆర్థిక శాస్త్రం-2
- మార్చి 14, 15 తేదీల్లో రసాయనశాస్త్రం-1, రసాయనశాస్త్రం-2, కామర్స్-1, కామర్స్-2, సోషియాలజీ-1, సోషియాలజీ-2, ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్-1 ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్-2
- మార్చి 16, 18 తేదీల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-1, లాజిక్-2, బ్రిడ్జికోర్సు గణితం-1, బ్రిడ్జికోర్సు గణితం-2
- మార్చి 19, 20 తేదీల్లో మోడ్రన్ లాంగ్వేజ్-1, మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ-1, జాగ్రఫీ-2
పదోతరగతి పరీక్షల 2024 షెడ్యూలు
- మార్చి 18వ తేదీన మొదటి భాష కాంపొజిట్ మొదటి భాష-1
- మార్చి 19వ తేదీన రెండోభాష
- మార్చి 20వ తేదీన ఆంగ్లం
- మార్చి 22వ తేదీన గణితం
- మార్చి 23వ తేదీన భౌతిక, రసాయనశాస్త్రం
- మార్చి 26వ తేదీన జీవశాస్త్రం
- మార్చి 27వ తేదీన సాంఘిక శాస్త్రం
- మార్చి 28వ తేదీన కాంపొజిట్ భాష-2, సంస్కృతం, అరబిక్, పార్శీ-1
- మార్చి 30వ తేదీన సంస్కృతం, అరబిక్, పార్శీ-2, వృత్తి విద్య కోర్సు థియరీ
మరిన్ని తాజా విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి.
