MLA Malla Reddy: పీకల్లోతు చిక్కుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేసు నమోదు!

రూ.250 కోట్ల విలువ చేసే భూకబ్జా కేసులో ఆరోపణలు

Share this :

ST atrocity case on MLA Malla Reddy మల్కాజిగిరి, డిసెంబర్‌ 14: మాజీ మంత్రిమల్లారెడ్డి (Former Minister Malla Reddy) చిక్కుల్లో పడ్డారు. ఆయన మీద అట్రాసి (ST atrocity case) కేసు నమోదు అయింది. శామీర్‌పేట్ పోలీసులు తెలిపారు. మల్కాజిగిరి (Malkajgiri) జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో ఉన్న 47 ఎకరాల 18 గంటల ఎస్టీ (లంబాడీల)వారసత్వ భూమిని మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Malla Reddy), ఆయన బినామీ అనుచరులు 9 మంది కలిసి అక్రమంగా కబ్జా చేసి కుట్రతో మోసగించి, భూమిని కాజేసారని షామీర్పేట్ పోలీసేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి న శామీర్పేట్ పోలీసులు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Police Case on Ex Minister Mallareddy)తోపాటు ఆయన అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 420 చీటీంగ్ కేసు నమోదు చేసారు.

చదవండి: Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండపై అసభ్య వీడియోలు.. యూట్యూబర్‌ అరెస్ట్!

ఈ సందర్భంగా బాధితుడు కేతా వత్ బిక్షపతి నాయక్మా ట్లాడుతూ.. ‘మా అమ్మ రాజీ పేరు మీద మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 33, 34, 35లో ఉన్న 47 ఎకరాల 18 భూమిమా పెద్దల నుంచి మాకు వారసత్వ హక్కుగా వచ్చిందన్నారు. మా కుటుంబ సభ్యులు తనతో కలిపి మొత్తం ఏడుగురి పేరున మొత్తం భూమి ఉందని అన్నారు. ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులైన శ్రీనివాసరెడ్డి హరిమోహన్ రెడ్డి, మధుకర్ రెడ్డి శివుడు, స్నేహరామిరెడ్డి, రామిలి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలు మాకు మాయ మాటలు చెప్పి, నిరక్ష్యరాశులైన తమతో రూ.250 కోట్ల విలువ చేసే భూమిని పీటీ సరెండర్ చేయించారని పేర్కొన్నారు. మా భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి, ఎస్టీ లంబాడీలమైన మా ఏడుగురికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున డబ్బు ఇచ్చారని తెలిపారు.

అధికార పార్టీ అండతో మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదేశాలతో రాత్రి 11 గంటలకు షామీర్పేట్ తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్, సబ్ రిజిస్టర్ వాణి రెడ్డి అక్రమంగా 47.18 ఎకరాల భూమిని మాజీ మంత్రి అనుచరులపై రిజిస్టర్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. తహసిల్దార్ వాణి రెడ్డి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తమకు ఎలాంటి సమాచారం చెప్పకుండా మంత్రి మల్లారెడ్డి డబ్బు సంచులకు కక్కుర్తి పడి తమ భూమిని మల్లారెడ్డికి దార దత్తం చేసిందని తాసిల్దార్ వాణి రెడ్డిపై దుమ్మెత్తి పోశారు. భూమిని అక్రమంగా అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేసి 20 లక్షలకు అమ్ముడు పోయిందని ఆరోపించారు. తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మూడు చింతల పల్లి తాసిల్దార్ వాణి రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసి, తగిన శాస్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అతని పార్టీ అనుచరులు 9 మందిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, తమ భూమిని అప్పగించాలని బాధితుడు కేతావత్ బిక్షపతి, అతని కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీడియా ద్వారా విన్నవించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.