Telangana DSC 2023 Postponed: తెలంగాణ డీఎస్సీ పరీక్ష వాయిదా.. కారణం ఇదే!

కొత్త షెడ్యూల్‌ ఎప్పుడు వస్తుందంటే..

Share this :

హైదరాబాద్‌, అక్టోబర్ 14: తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) వాయిదా (Telangana DSC 2023 Postponed) పడింది. ఈ మేరకు పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన శుక్రవారం (అక్టోబర్‌ 13) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీఆర్‌టీ (DSC) నిర్వహించేందుకు గతంలో విద్యాశాఖ షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ (Telangana)లో త్వరలో జరననున్న అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections 2024) నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అంతరాయం ఏర్పడుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. నవంబరు 30న ఎన్నికలు జరగనుండటంతో టీఆర్టీ (TRT) పరీక్షలు వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

తెలంగాణ టీఎస్పీయస్సీ (TSPSC) వరుస పేపర్‌ లీకేజీ వ్యవహరాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలను లీకేజీలకు తావియ్యకుండా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారంగా నవంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇంతలో అనూహ్యంగా రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో పరీక్షల నిర్వహణ కష్టసాధ్యమని అధికారులు భావించారు. దీంతో టీఆర్టీ పరీక్షలు వాయిదా పడ్డాయి.

Also Read: Fact Check: టీవీ9 రజనీకాంత్‌పై నెట్టింట ట్రోలింగ్‌.. ‘దిస్ ఇజ్‌ నాట్ వాస్తవం’

ప్రస్తుతం ఈ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబరు 20 నుంచి మొదలైన దరఖాస్తు స్వీకరణ అక్టోబరు 21 వరకు గడువు కొనసాగనుంది. ఈసారి డీఎస్సీకి 2.5 లక్షల మంది వరకు పోటీ పడతారని అంచనా. పరీక్షలను నవంబరులో నిర్వహించకుంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ స్లాట్లు దొరకవని ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతుల చేపట్టిన టీసీఎస్‌ అయాన్‌ గతంలోనే తెల్పింది. ఒకవేళ ఫిబ్రవరిలో నిర్వహిస్తే.. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తికాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబరులోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. కానీ, ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడటంతో మళ్లీ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా ఎన్నికల నేపథ్యంలో టీఎస్పీయస్సీ గ్రూప్‌ 2 పరీక్షలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. నవంబర్ 2, 3న గ్రూప్-2 (TSPSC Group 2) పరీక్ష నిర్వహించాల్సి ఉండగా కమిషన్‌ వాయిదా వేసింది. తిరిగి వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 గ్రూప్‌ 2 పోస్టులకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: Prabhas AI Wedding Photos: ‘ప్రభాస్‌కు పెళ్లి అయిపోయిందోచ్‌.. భార్య పిల్లలు కూడా ఉన్నారు’ ఫొటోలు వైరల్‌