తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఐనటువంటి తమిళిసై గవర్నర్ కోటాలో ఉన్న శాసనమండలి అభ్యర్థుల సెలెక్ట్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన అధీనంలో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను సున్నితంగా తిరస్కరించారు. సాధారణంగా అన్నీ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వ అధినేత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిన వాళ్ళను గవర్నర్ యొక్క ఆమోదనికి పంపిస్తే దానికి గవర్నర్ ఒప్పుకుంటారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా పరిస్థితి నెలకొలిపివుంది. గతంలో కూడా ప్రభుత్వనికి వ్యతిరేకంగా కొన్ని విషయాల్లో గవర్నర్ వ్యవహారించారాని మనందరికీ తెలుసు. అలాగే ఈ విషయంలో కూడా ఆమె శైలి అలానే ఉంది. దానికి ఆమె చెప్పే కారణం ఏంటో ఇపుడు చూద్దాం.
ప్రభుత్వం సిఫార్సు చేసిన నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాలను ఆమె రిజెక్ట్ చేశారు. దానికి కారణం ఆర్టికల్ 171 (5)- ప్రకారం వీళ్ళకి తగిన అర్హత లేదన్నారు. అంతేకాదు వారిని సెలెక్ట్ చేయడానికి వారికీ సంబంధించిన డేటా అనేది ఆమె తన వద్ద లేదని అన్నారు. కుర్రా సత్యనారాయణ రాజకీయంగా యాక్టీవ్ గా ఉన్నా, సామాజిక సేవ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడ స్పందించలేదని ఆమె అన్నారు. మన రాష్ట్రంలో చాలా మంది వివిధ రంగాల్లో ప్రముఖులు ఉన్నారని మరి వాళ్ళని సెలెక్ట్ చేయకుండా రాజకీయ నాయకులని ఎందుకు సెలెక్ట్ చేస్తుందొ తనకి అర్ధం కానీ పరిస్థితి గ్రేటర్ తెలంగాణాలో ఉందని ఆమె అన్నారు.
అసలు పొలిటిషన్స్ ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని అలా చేయడం ఆర్టికల్ 171 (5)కి విరుద్దం అని ముఖ్యమంత్రికి, కేబినెట్ కి ఆమె హెచ్చరించారు. గత కొంత కాలంగా దాసోజు శ్రవణ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈయన కూడా ఏ రంగంలోనూ సేవ కార్యక్రమాలు చేయలేదని ఆమె అన్నారు.అర్హత ఉన్నవారిని మాత్రమే తాను సెలెక్ట్ చేస్తానని ఆమె అన్నారు.
