Kerala Aluva Rape case కొచ్చి, నవంబర్ 15: తినుబండారాల ఆశచూపి ఐదేళ్ల పసికందుపై అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై దారుణంగా హత్యచేసిన నరరూప రాక్షసుడికి కేరళ హైకోర్టు (Kerala) ఉరి శిక్ష విధించింది. మరణశిక్ష (death sentence)తోపాటు అయిదు యావజ్జీవ కారాగార శిక్షలు, రూ.7.3 లక్షల జరిమానా కూడా చెల్లించాలంటూ హైకోర్టు (Kerala High Court) మంగళవారం (నవంబర్ 14) తీర్పు వెలువరించింది.
కేరళలోని అలువా ప్రాంతంలో జులై 28న బిహారీ (Bihar) వలస కార్మికుడు అస్ఫాక్ ఆలం (28) అనే వ్యక్తి తనతో పాటు అదే భవనంలో నివసిస్తున్న తోటి బిహారీ వలస కుటుంబానికి చెందిన అయిదేళ్ల బాలికకు జులై 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో తినుబండారాలు ఆశ చూపి బయటకు తీసుకుపోయాడు. అనంతరం జ్యూస్ తాగిస్తూ దూరంగా తీసుకుపోవడం సీసీ టీవీ (CC TV)లో నమోదైంది. దారిలో ఎదురైన ఓ వ్యక్తి పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ ప్రశ్నించగా తాను ఆ బాలిక తండ్రినని నమ్మబలికాడు. అలా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన తరవాత బాలికకు మద్యం తాగించి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక దుస్తులనే మెడకు బిగించి హతమార్చాడు. బాలిక మృతదేహంపై చెత్త వేసి, గ్రానైట్ రాళ్ల కింద పూడ్చిపెట్టి ఏమీ ఎరగనట్లు (5-year-old rapist-murderer gets death) నాటకాలాడసాగాడు. ఈ కేసు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్ర్భాంతి గురి చేసింది. చిన్నారి అంత్యక్రియలకు వందలాది మంది తరలివచ్చారు.
చదవండి: MP Raghu Rama Krishna Raju: ‘సీఎం జగన్ గాలి తిరుగుళ్ళు ఆపి.. నేల తిరుగుళ్ళు తిరగాలి’.. ఎంపీ రఘురామ
బాలికపై అఘాయిత్యం, లైంగిక హింసకు పాల్పడి, దారుణంగా హత్య చేసిన నిందితుడు అసఫక్ ఆలంను గత వారం ఎర్నాకులం అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. పోక్సో చట్టం లోని పలు సెక్షన్ల కింద దోషిగా కోర్టు గుర్తించింది. నిందితుడు ఆలంను కనుక విడిచిపెడితే మరెందరో మైనర్ బాలికలతో పాటు పుట్టబోయే ఆడశిశువులకూ ప్రమాదమని హైకోర్టు తీర్పు సంబందర్భంగా నొక్కిచెప్పింది. ఆలం వయసు, సామాజిక ఆర్థిక నేపథ్యం వంటి వివరాలను పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలన్న డిఫెన్స్ న్యాయవాది వాదాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. నేరస్తుడు ఆలంకు పిల్లలపై లైంగిక దాడులు చేయడం ఇదేం తొలిసారి కాదు.

2018లో ఢిల్లీలో పదేళ్ల బాలికపై ఆలం లైంగిక దాడి చేసినందుకు నెలరోజులు జైలులో ఉండి బెయిలుపై విడుదల అయ్యాడు. బాలలపై లైంగిక నేరాల కట్టడికి ఉద్దేశించిన పోక్సో చట్టం, ఐపీసీ నిబంధనలను అనుసరించి ఆలంకు హైకోర్టు అయిదు యావజ్జీవ కారాగారాలతోపాటు ఒకటి నుంచి పదేళ్ల వరకు విడివిడిగా జైలు శిక్షలు విధించింది. అనంతరం యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు తీర్పును సవాలు చేసే అవకాశం ఆలంకు ఉన్నందున, ఆ అవకాశాన్ని అతడు ఉపయోగించుకున్న తర్వాత ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు పేర్కొంది.
కాగా ఘటన జరిగిన 110 రోజులకే ఈ కేసులో తీర్పు వెలువడింది. 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి 60 రోజుల్లో విచారణ జరిపారు. ఈ మేరకు హత్య కేసులో దోషికి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి కె. సోమన్ ఐదు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు మరో 49 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఇతర నేరాలకు రూ.5.20 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారందరికీ ఈ తీర్పు హెచ్చరికగా నిలుస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. బాలికను క్రూరంగా హతమార్చాడు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సత్వరమే స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రభుత్వం బాలిక కుటుంబానికి అన్నిరకాలుగా సహాయం చేస్తుందని అన్నారు. ఈ తరహా దురాగతాలను నాగరిక సమాజం సహించదని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.