అమెరికా, నవంబర్ 9: విద్యాబుద్ధులు నేర్పి, భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచరే వికృత చేష్టలకు పాల్పడింది. విద్యార్థిగా (student) ఉన్న సమయంలో తనతో టీచర్ శృంగారం (sexual abuse of minor)లో పాల్గొందని ఓ యువకుడు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. దీంతో సదరు టీచరమ్మ (Teacher) కటకటాల పాలైంది. ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చే విధంగా ఉన్న ఈ సంఘటన 8 ఏళ్ల క్రితం అమెరికాలో (United States) చోటుచేసుకుంది. తాజాగా బాధిత విద్యార్ధి పోలీసులకు తెపడంతో ఈ ఘటన (Crime News) ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు (police) తెలిపిన కథనం ప్రకారం..
యునైటెడ్ స్టేట్స్ (USA)లో 2015లో 31 ఏళ్ల మెలిస్సా మేరీ కర్టిస్ అనే మహిళా మోంట్గోమేరీ విలేజ్ మిడిల్ స్కూల్లో టీచర్‌గా పనిచేసింది. ఆ సమయంలో అదే స్కూల్లో ఎనిమిదో తరగతి విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆమె వయసు 22 ఏళ్లు. బాధిత విద్యార్ధికి 14 ఏళ్లు. గత నెలలో బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తను విద్యార్ధిగా ఉన్నప్పుడు అప్పర్ మార్ల్బోరోకు చెందిన 31 ఏళ్ల మెలిస్సా మేరీ కర్టిస్ అనే టీచర్ తన కారులో ఎక్కించుకుని తన నివాసానికి తీసుకెళ్లి శృంగారంలో పాల్గొందని బాధితుడు ఆరోపించాడు. 2015 జనవరి-మే నెలల మధ్యలో ఆమె పలుమార్లు తనతో లైంగిక చర్యలో పాల్గొన్నట్లు యువకుడు తెలిపాడు.
దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ సంఘటన అమెరికాలోని మాంట్గోమెరి కౌంటీలో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థికి పలుమార్లు మద్యం తాగించి, గంజాయి ఇచ్చి టీచర్ కర్టిస్ శృంగారంలో పాల్గొన్నట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అక్టోబర్ 31న ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేశామని తెలిపారు. ఈ ఘటనలో సదరు మాజీ టీచర్‌పై పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ స్కూల్లో ఆమె రెండు ఏళ్లు టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత 2017లో టీచర్ జాబ్‌కు రాజీనామా చేసినట్లు మాంట్గోమేరీ కౌంటీ పబ్లిక్ స్కూల్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ స్కూల్లో ఇంకా ఎవరైనా బాధితులున్నారేమో తెలుసుకునే దిశగా విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

Comments are closed.