Rajasthan Land Dispute Murder: దారుణ ఘటన.. ట్రాక్టర్‌తో 8 సార్లు తొక్కించి సోదరుడి హత్య! వీడియో వైరల్

పట్టపగలు.. వందల మంది చూస్తుండగా..

Share this :

Land dispute between brothers in Rajasthan జైపూర్‌, అక్టోబర్ 26: రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య భూవివాదం (land dispute) చిలికి చిలికి గాలివానగా మారింది. ఓ స్థలం విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది. అది రెండువర్గాల మధ్య తీవ్ర ఘర్షనకు దారి తీసింది. ఈ క్రమంలో సోదరుడినిట్రాక్టర్‌ (tractor)తో కసితీరా తొక్కించి చంపాడు మరో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

Also Read: Gautami Tadimalla Resigns BJP: తమిళనాడు బీజేపీకి వరుస షాక్‌లు.. పార్టీని వీడుతోన్న సినీ గ్లామర్!

రాజస్థాన్‌ (Rajasthan)లోని భరత్‌పుర్‌ (Bharatpur)లోని బయానా ప్రాంతానికి చెందిన బహదూర్‌ సింగ్‌ గుర్జర్‌, అతర్‌ సింగ్‌ గుర్జర్‌ అనే వ్యక్తుల కుటుంబాల మధ్య ఓ స్థలం విషయమై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్‌ 25) బహదూర్‌ కుటుంబ సభ్యులు వివాదం నెలకొన్న స్థలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌ వేసుకుని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అథర్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాల వాళ్లు కర్రలు, రాళ్లలతో పరప్పర దాడులు చేసుకున్నారు. తుపాకీ శబ్దాలు కూడా వినిపించాయని గ్రామస్థులు తెలిపారు.

Also Read: Bogus Calculations on YSR Death: ‘మీది తప్పుడు లెక్కని ఒప్పుకోండి.. టీడీపీదే అసలు లెక్క’ ఎంపీ రఘురామ కృష్ణంరాజు

వరుసకు సోదరులే.. అయినా..

ఈ గొడవలో అతర్‌ సింగ్‌ కుటుంబానికి చెందిన నిర్పత్‌ అనే వ్యక్తి నిరసనగా నేలపై పడుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన బహదూర్‌ కుటుంబానికి చెందిన మరో వ్యక్తి ట్రాక్టర్‌తో అతనిపైకి దూసుకొచ్చాడు. అక్కడున్నవారు ట్రాక్టర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసినా దామోదర్‌ నిరాకరించాడు. దీంతో నిర్పత్‌ చనిపోయేవరకూ ట్రాక్టర్‌తో వెనక్కి ముందుకు 8 సార్లు తొక్కించి (Man crushed to death under a tractor) చంపాడు. ఈ ఘటనలో నిర్పత్‌ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు, నిందితుడు వరుసకు సోదరులవుతారని (land dispute between brothers) తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు పది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన బహదూర్‌ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు సదర్‌ పోలీస్‌స్టేషన్‌ (Sadar police station) ఇన్‌చార్జి జైప్రకాష్‌ తెలిపారు.

https://twitter.com/kaankit/status/1717091945909276747

నిజానికి, ఐదు రోజుల క్రితం కూడా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో బహదూర్‌, అతని తమ్ముడు జానక్‌ గాయపడ్డారు. అనంతరం ఈ విషయమై అథర్‌ సింగ్‌, అతని కుమారుడు నిర్పత్‌పై బహదూర్‌ కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. పగతో రగిలిపోయిన బహదూర్‌ వర్గం వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. అధికార కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ విరుచుకుపడింది. ప్రియాంక గాంధీపై తీవ్ర పదజాలంతో బీజేపీ నేత సంబిత్‌ మండిపడ్డారు. ఆమె వెంటనే ఈ దారుణ ఘటన జరిగిన భరత్‌పూర్‌ని సందర్శించాలని డిమాండ్‌ చేశారు.