BRS లోకి బాగ్ అంబర్ పేట కార్పొరేటర్!

Share this :

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడానికి తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ఆశావాహులు పార్టీలు మారే పనిలో ఉన్నారు. ఇటీవల అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లు కేటాయించే పనిలో ఉన్నారు. మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ నియోజకవర్గాలు, కీలక ప్రాంతాల్లో దృష్టి సారించారు.  బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పోరేటర్ పద్మా వెంకట్ రెడ్డి దంపతులు నేడు బీజేపీ ని వీడి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు.

ఈ క్రమంలో పద్మా వెంకట్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ.. అంబర్ పేట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రస్తుత ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాల్లో ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరికి మద్య అంతర్గత పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసేలా చక్రం తిప్పారు కేటీఆర్. ఇక పద్మా వెంకట్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడంతో బీజేపీ కి గట్టి షాక్ తగిలిందని అంటున్నారు.