ఈ మద్య కాలంలో మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. కొంతమంది ప్రేమ పేరుతో ఎంతోమంది అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు. ఒంటరిగా ఆడవాళ్లు బయట తిరగాలంటే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఓ ఉన్మాది యువతిని, ఆమె తమ్ముడిని దారుణంగా పొడిచాడు. తమ్ముడు తీవ్ర గాయాలతో చనిపోగా, అక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సంఘవి అనే యువతి హూమియోపతి మెడిసన్ చదువుతుంది. గత కొంతకాలంగా శివకుమార్ వ్యక్తి సంఘవిని ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతున్నాడు. అతని ప్రేమను కాదన్నందుకు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం సంఘవి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు.
తన ప్రేమ అంగికరించాలని కోరాడు. కానీ ఆమె తిరస్కరించడంతో ఉన్మాదిగా మారిపోయాడు. కత్తితో ఆమెను దారుణంగా పొడిచాడు.. అడ్డుగా వచ్చిన ఆమె తమ్ముడు చింటూ పై కూడా దాడిచేశాడు. బాధితులు గట్టిగా అరవడంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చి శివకుమార్ ని బంధించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
