తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!

Share this :

తెలంగాణాలో ఇటీవల భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గత కొద్దిరోజులుగా ఎండ, విపరీతమైన ఉక్కపోతతో తెలంగాణ ప్రజలు సతమతమవుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు ఓ మోస్తారుగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. తెలంగాణలో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.

తెలంగాణలో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో సెప్టెంబర్ 3న ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని.. వీటి ప్రభావంతో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హైదరాబాద్ సంచాలకురాలు కే నాగరత్న తెలిపారు. శనివారం నుంచి తెలంగాణలో వరుణుడు రీ ఎంట్రీ ఇచ్చింది. సోమవారం నుంచి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, కొత్తగూడెం, నిజామాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, వ‌న‌ప‌ర్తి, నాగ‌ర్‌క‌ర్నూల్‌, పెద్దప‌ల్లి, మంచిర్యాల‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను కూడా జారీ చేసింది.