సోనియా గాంధీకి అస్వస్థత.. హాస్పిటల్ లో చేరిక!

Share this :

కాంగ్రెస్ అగ్రనేత, రాయ్ బరేలీ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీ లోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సోనియా గాంధీ ఛాతి ఇన్ఫెక్షన్ తో పాటు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్ట్ 31 న ముంబైలోని జరిగిన ప్రతిపక్షాల కూటమి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అంతకు ముందు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించిన తర్వాత స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

ఈ ఏడాది సోనియా గాంధీ రెండోసారి అస్వస్థతకు గురయ్యారు. జనవరి 12వ తేదీన వైరల్ రెస్పటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం ఆమె సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం చికిత్స తీసుకొని 17వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత మార్చి 2న జ్వరం కారణంగా మరోసారి సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. తాజాగా జ్వరం, ఛాతి నొప్పి రావడంతో ఢిల్లీలోని స‌ర్ గంగా రామ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇటీవల సోనియా గాంధీ తన కుటుంబ సభ్యులతో జమ్ము కాశ్మీర్ లో పర్యటించారు. ఈ పర్యటన రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.