వీళ్ళు అసలు మనుషులేనా.. మేక కోసం దారుణం!

Share this :

ఇటీవల కొంతమంది మనుషులు మానవత్వం మరచి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేయడం, హింసించడం లాంటివి చేస్తున్నారు. ఎలాంటి నేరం చేయకున్న అమాయకులపై నేరం మోపి దారుణంగా హింస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. మేకలు దొంగలించారని ఇద్దరు యువకులను దారుణంగా చిత్ర హింసలకు గురి చేశారు. కాళ్లను తాళ్లతో కట్టి తలకిందులుగా వేలాడదీసి కింద పొగ పెట్టి హింసించారు. ఈ దారుణ ఘటన తెలంగాణ లోని మంచిర్యాల జిల్లాలో జరిగింది.

మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామంలో కొమురాజుల రాములు, భార్య స్వరూప, కొడుకు శ్రీనివాస్ అంగడి బజార్లో నివాసం ఉంటున్నారు. పట్టణ శివారులో షెడ్డు వేసుకొని మేకలు పెంచుతున్నారు. తేజ అనే యువకుడు పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. ఇరవై రోజుల కిందట మంద నుంచి మేక కనిపించుకుండా పోయింది. దీంతో మేక ను తేజ అతని స్నేహితుడు కిరణ్ దొంగిలించాడని యజమాని కుటుంబం అనుమానం పెంచుకుంది. ఇంటికి పిలిపించుకొని కాళ్లకు తాళ్లతో కట్టి తలకిందులుగా వేలాడదీసి కింద పొగ పెట్టి హింసించారు. వీరిద్దరిని హింసిస్తున్న ఫోటోలు బయటకు రావడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేుశారు. దీంతో నింధితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.