ఘనంగా వంగవీటి రాధా నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే!

Share this :

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వంగవీటి మోహన్ రంగా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆయన తనయుడు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహ నిశ్చితార్థం జక్కం పుష్పవల్లితో నరసాపురం లో వైభవంగా జరిగింది. ఇటీవల నరసాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ జక్కం అమ్మాని, బాబ్జీ దంపతుల కుమార్త పుష్పవల్లితో వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే.

నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. అక్టోబర్ 22 న వీరి వివాహం నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. వాస్తవానికి నిశ్చితార్థం మొదట బెంగుళూరులో చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. నరసాపురంలో సాదాసీదాగానే నిశ్చితార్థ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ మదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జనసేన ఇన్ చార్జి బొమ్మిడి నాయకర్ తో పాలు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఇక తమ అభిమాన నేత వంగవీటి రాధా ఓ ఇంటివాడు కానుండడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.