ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 11వ తేది వరకూ ఏపీ సీఎం జగన్ తన సతీమణి భారతితో కలసి లండన్ పర్యటన బయలుదేరారు. 10 రోజుల విదేశీ పర్యటన అనంతరం ఈ నెల 12న తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దంపతులకు వీడ్కోలు పలికారు.
ఏపీ సీఎం జగన్ కూతుర్లు లండన్ లో తమ తమ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న తరుణంలో, సీఎం జగన్ దంపతులు వారి పిల్లలను కలవడానికి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజులలో ఎన్నికల సంగ్రామం మొదలవ్వనున్న నేపథ్యంలో కుటుంబానికి సమయం ఇవ్వడం అసంభవం కాబట్టి, ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారని ఏపీ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.
