తిరువనంతపురం, డిసెంబర్ 8: కేరళ (Kerala) రాజధాని తిరువనంతపురంలో (Tiruvanthapuram) దారుణం చోటు చేసుకుంది. ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య (Kerala Doctor Suicide)కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి నిశ్చయమై, ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగు పెట్టేవేళ ఆమె ప్రియుడి కుటుంబం చేసిన వరకట్నం డిమాండ్లు ఆమె జీవితానికి చరమగీతం (Kerala Doctor Suicide) పలికాయి. వరకట్నంగా (Dowry) బీఎండబ్ల్యూ కారు (BMW Car), 15 ఎకరాల ల్యాండ్ (Land), 150 సవర్ల బంగారం (Gold) కావాలంటూ వరుడి కుటుంబం డిమాండ్ చేసింది. వాటిని ఇచ్చే స్తోమత లేకపోవడంతో ఇటీవల ఆమె పెళ్లి రద్దయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య (suicide) చేసుకుంది. మంగళవారం (డిసెంబర్ 5) ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తాజాగా పోలీసులు నిందితుడిని అరెస్టు (Kerala doctor Arrest) చేసి కటకటాల వెనుకవేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరువనంతపురానికి (Tiruvanthapuram) చెందిన డాక్టర్ షహానా (26) స్థానిక ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఆమెకు తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. తండ్రి రెండేళ్ల క్రితమే మరణించారు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ రువాయిస్, షహానా గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో రువాయిస్ కుటుంబం వరకట్నం (Dowry) కింద బీఎండబ్ల్యూ కారు (BMW Car), 15 ఎకరాల భూమి, 150 సవర్ల బంగారం (Gold) ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకునేంత స్తోమత షహానా కుటుంబానికి లేకపోవడంతో రువాయిస్ కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది. పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన షహానా డిసెంబర్ 5న సూసైడ్ చేసుకుంది.
దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని మహిళ, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి జార్జ్ ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సంఘటన స్థలంలో సూసైడ్ లెటర్‌ను పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. షహానా మృతికి రువాయిస్ కారణమని పోలీసుల దర్యాప్తులో తేలడంతో, నిందితుడిని గురువారం (డిసెంబర్ 7) అరెస్టు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న నిందితుడిని సస్పెండ్ చేశారు. ఈ రోజు అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు. పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా కేరళ రాష్ట్ర మైనార్టీ కమిషన్ కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.
నీ కంటే డబ్బే ముఖ్యం..
మృతురాలు షహానా సోదరుడు జాసిమ్ నాస్ మీడియా ఎదుట మాట్లాడుతూ.. కట్నం (Dowry) ఇవ్వకుండా పెళ్లి చేయాలనుకుంటున్నారా? రువాయిస్ తండ్రి తమను దుర్భాషలాడారని, వాళ్లు కోరినంత కట్నం ఇవ్వలేకపోయినా, తమకు వీలైనంత ఇస్తామని చెప్పినా అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రువాయిస్ తల్లిదండ్రులు అంగీకరించకపోయినా, వాళ్లను ఒప్పించి తన సోదరిని పెళ్లి చేసుకుంటాడనే ఓ చిన్న ఆశ తమకు ఉండేదని, కానీ అతడు కూడా ‘నీకంటే నాకు డబ్బే ముఖ్యం’ అని చెప్పడంతో షహానా తట్టులేకపోయింది. వరకట్నం (Dowry)కారణంగానే తన పెళ్లి ఆగిపోయిందని షహానా గత కొన్ని రోజులుగా తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు ఆమె స్నేహితులు తెలిపారు. నిందితుడు, అతని కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా స్పందిచిన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వరకట్నాన్ని డిమాండ్ చేస్తే ఆ పెళ్లిని తిరస్కరించాలని మహిళలకు సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
