పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత దిగజారిన పసిడి విలువ….!!

Share this :

ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ముఖ్యంగా భారత్ లో బంగారం అంటే మహిళలు అమితంగా ఇష్టపడుతుంటారు. ఏ చిన్న శుభకార్యం, పండుగలు వచ్చినా కొత్తరకం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. బంగారం ధరలు  గత వారం రోజులనుండి తగ్గుముఖం పట్టాయి.  అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సమయంలో గోల్డ్ ధరలు భారీగా తగ్గడంతో బంగారం కొనుగోలు దారులు ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి. వరుసగా ఐదు రోజులు తగ్గుకుంటూ వచ్చిన ధరలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. 

మార్కెట్ లో 10గ్రాముల బంగారం ధర 22 క్యారట్ రూ. 150 దిగొచ్చి రూ. 53,200కి చేరింది. సోమవారం ఈ ధర రూ.53,350గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,320గా ఉంది.  24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 160 తగ్గి రూ. 58,040కి చేరింది. సోమవారం రోజు ఈ ధర రూ. 58,200గా ఉండేది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,804గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,350గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,190గా ఉంది. హైదరాబాద్​లో నేడు 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,200గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,040గా నమోదైంది. విజయవాడలో కూడా అవే రేట్లు ఉండడం గమనార్హం.

మరోవైపు దేశంలో వెండి ధరలు కూడా రోజు రోజుకి తగ్గుతున్నాయి. నేడు 100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 500 తగ్గి రూ. 73,000కి చేరింది. సోమవారం నాడు ఈ ధర రూ. 73,500గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 75,500 పలుకుతోంది.విజయవాడ లో సైతం అవే ధరలు కొనసాగతున్నాయి.అయితే ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి వాటి కారణంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు జరుగు తున్నాయని నిపుణులు చెబుతున్నారు.