ప్రపంచంలో ఎవరైన బంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అయితే అలాంటి బంగారం యొక్క విలువ రోజు రోజు మారిపోతా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర రోజు రోజుకి పడిపోవడానికి కారణం ఫెడ్ వడ్డీ అనేవి మాక్సిమం స్థాయిలో ఇదేవిధంగా కొనసాగుతాయని అనాలసిస్ గట్టిగా ఉండటమే. ఈ క్రమంలోనే ఈరోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ ల తులం బంగారం ధర రూ.280 తగ్గి రూ.59,450 వద్దకు వచ్చి ఆగింది.ఆభరణాల బంగారం ధర 22 క్యారెట్ ధర అనేది రూ.250 తగ్గుదలతో రూ.54,500 వద్దకు చేరింది.ఈ పుత్తడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు మార్నింగ్ నమోదైనవి. దేశ రాజధాని ఐనా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,900లుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,880గా నమోదైంది.
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. అయితే వెండి విషయం హైద్రాబాద్ లో ఒక కేజీ వెండి ధర కూడా రూ.600 తగ్గి రూ.77,000 వద్ద ఆగింది.దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 74,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1,000 తగ్గింది.అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర 1,900 డాలర్ల దిగువకు పడిపోయింది. ఫెడరల్ రిజర్వ్ అవలంబిస్తున్న కఠిన వైఖరితో ఒక డాలర్ విలువ 10 నెలల గరిష్ఠ స్థాయికి పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ అనాలసిస్ట్ అయినా సౌమిల్ గాంధి తెలిపారు.
