రోజు రోజుకి క్షీణిస్తున్న పసిడి ధర….!

Share this :

బంగారం అంటే భారతీయులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే దేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇటీవల బంగారం రేటు పెరిగిపోతూ వస్తుంది. కానీ గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌  10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.59,450 వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర  రూ.250 తగ్గుదలతో రూ.54,500 వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,900లుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,880గా నమోదైంది.

మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ లో కేజీ వెండి ధర కూడా రూ.600 తగ్గి రూ.77,000 వద్ద కొనసాగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 74,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1,000 తగ్గింది.అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర 1,900 డాలర్ల దిగువకు పడిపోయింది. ఫెడరల్‌ రిజర్వ్‌ అవలంబిస్తున్న కఠిన వైఖరితో ఒక డాలర్‌ విలువ 10 నెలల గరిష్ఠ స్థాయికి పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ అనాలసిస్ట్‌ అయినా సౌమిల్‌ గాంధి తెలిపారు.