APPSC Group 2 Recruitment 2023 అమరావతి, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గురువారం (డిసెంబర్ 8) నోటిఫికేషన్ (APPSC Group 2 Notification 2023) విడుదలైంది. మొత్తం 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC Group 2 Recruitment 2023 ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. జనవరి 10వ తేదీని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది.
ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష విధానం ఇలా..
గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. భారతదేశ చరిత్ర (ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర)లో 30 మార్కులకు 30 ప్రశ్నలు, భూగోళశాస్త్రం(జనరల్, ఫిజికల్ జాగ్రఫీలో 30 మార్కులకు 30 ప్రశ్నలు, ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీలో 30 మార్కులకు 30 ప్రశ్నలు, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ)లో 30 మార్కులకు 30 ప్రశ్నలు, భారతీయ సమాజం (స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషియల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం)లో 30 మార్కులకు 30 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు)లో 30 మార్కులకు 30 ప్రశ్నలు, మెంటల్ ఎబిలిటీ (లాజికల్ రీజనింగ్,మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ)లో 30 మార్కులకు 30 ప్రశ్నలు.. మొత్తం 7 అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష విధానం ఇలా..
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. పేపర్-1 (ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం)లో 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు. పేపర్-2 (భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ)లో 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ (APPSC Group 2 Revised Syllabus) కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యాసంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.