జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో గేమ్ ఛేంజర్ కాబోతున్నారు. ఒక కీలకమైన బాధ్యతని ఏరి కోరి పవన్ భుజాలపై పెట్టబోతున్నారు. అదేంటనే కదా మీ ఆసక్తి… అదే త్రిబుల్ ఆర్ ఫార్ములా… రిపబ్లిక్ డే రోజు పవన్ కల్యాణ్ ఇచ్చిన రాజోలు, రాజానగరం స్పీచ్ వెనక పెద్ద కసరత్తే జరిగిందని సమాచారం. ఆట మొదలు పెట్టేశారు ఇక రెడీ ఉండండి…అందుకే పవన్ ఈ బృహత్తర బాధ్యతలో భాగంగానే గొంతు విప్పినట్టు తెలుస్తోంది.
ఆపరేషన్ ఏపీలో భాగంగా ఇష్టం ఉన్నా లేకున్నా… జగన్ సర్కార్‌ని సాగనంపాలంటే చంద్రబాబుతో కలవక తప్పని పరిస్థితి ఉంది. పవన్ సొంతంగా విస్తరించడానికి తగినంత సమయం లేదు. అందుకే బీజేపీ పెద్దలు ఈ త్రిబుల్ ఆర్ ఫార్ములా రెడీ చేశారనేది టాక్. ఊహించనివిధంగా ఏపీలో జరిగిన షర్మిల ఎంట్రీతో రాజకీయ కోణంలో 2029 ప్లాన్ అనేదానికి అనేక ఆటంకాలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. అందుకే 2024లోనే తన ఆట ఏపీలో మొదలు పెట్టాలని కాషాయదళం డిసైడ్ అయింది. అనుకున్నదే తడవుగా టీడీపీ-జనసేన కూటమితో కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు ఓ కండీషన్ పెట్టంది. అదే గేమ్ ఛేంజర్ రోల్… ఆ పాత్ర తీసుకోవాల్సింది జనసేన అధినేత పవన్ కల్యాణ్. అలా అయితేనే పొత్తులో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం చంద్రబాబు చెప్పింది పవన్ వినడం కాదు, పవన్ చెప్పింది చంద్రబాబు వినాలి. అలాంటి లీడ్ తీసుకుంటేనే పొత్తు తథ్యం అనే సంకేతాలు పంపింది. దీంతో టీడీపీలో కూడా ఒక అలజడి నెలకొంది. ఓట్ షేర్ తగ్గుతుందనే ఆలోచనతో బీజేపీని దూరం పెడితే ఏపీలో ఫెయిర్ ఎలక్షన్స్ జరగవని, తిరుపతి ఉప ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని టీడీపీ ఆందోళన చెందుతోంది. దీంతో అయిష్టంగా అయినా బీజేపీతో జతకట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఇటువంటి స్థితిలోనే పవన్ త్రిబుల్ ఆర్ ఫార్ములాని అమలు చేయడం మొదలు పెట్టారు… నోనో.. అలా అమలు చేస్తేనే ఢిల్లీకి రావాలని కండిషన్ పెట్టారు కాషాయ పెద్దలు. సక్సెస్‌ఫుల్‌గా గేమ్ ఛేంజర్ పాత్ర పోషించిన తర్వాత బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం పవన్ రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.
అన్నీ అనుకున్నట్టుగా మూడు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయితే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సేనాని ఢిల్లీ పర్యటనలో మళ్లీ ఎలాంటి కొత్త కండిషన్స్ వస్తాయో అనే గుబులు తెలుగుదేశంలో నెలకొంది. బీహార్ పాలిటిక్స్ చూసిన తర్వాత నెంబర్ గేమ్‌లో బీజేపీ పెద్దల్ని ఎదుర్కోవడం చాలా క్లిష్టమైన పని అని స్వయంగా చంద్రబాబే గతంలో వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో తాజాగా జరుగుతున్న పరిణామాల్లో ఇండియా కూటమి కూడా విచ్ఛిన్నం అవుతున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ అవుట్. రేపో మాపో నితీష్ కూడా బ్యాక్ సీట్ తీసుకుంటాడు. ఆమ్ ఆద్మీ కామ్ నెక్స్ట్ మొదలువుతుందనే భావన ఉంది. ఇండియా కూటమిలో బలంగా వ్యవహరిస్తున్న ఈ ముగ్గుర్నీ కాంగ్రెసస్కి దూరం చేస్తే రాబోయే ఎన్నికలు సగం గెలిచినట్టేనని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దక్షిణాదిపైన ఇంకా అంత ఫోకస్ పెట్టే తీరిక హస్తినకు లేదు. అందుకే ఇక్కడ పవన్‌ని బలోపేతం చేస్తే ఏపీలో తమకు తగిన పట్టు లభిస్తుందని తెలంగాణాపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడానికి కూడా సమయం దక్కుతుందనేది బీజేపీ పెద్దల ఆలోచన. ఈ వ్యూహం కనుక పక్కాగా అమలైతే తెలుగుదేశాన్ని కూడా తమకు కావల్సినట్టుగా నియంత్రించవచ్చనేది వారి వ్యూహం. వెయిట్ ఫర్ సేనాని ఢిల్లీ టూర్… అప్పుడు సీన్ రసవత్తరంగా మారడం ఖాయం!
