యూట్యూబ్ బ్యూటీ పార్లర్ పేరుతో రూ.3 వసూలు చేసి బోర్డ్ తిప్పేసి ఘటన హైదరాబాద్ నిజాంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అక్క, బావ, మరదలు కలిసి బ్యూటీ పార్లర్ పేరుతో ఫ్రాంచైజ్ లు ఇస్తామంటూ రూ. 3 కోట్లు వసూలు చేసి పరారైయ్యారు. ప్రగతినగర్ లో నివాసముండే ఇస్మాయిల్, సమీరా దంపతులు, సమీరా చెల్లెలు జెస్సికా కలిసి రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో యూట్యూబ్ లో యాడ్స్ చేసి అమాయకుల దృష్టిని ఆకర్షించారు. తమ పార్లర్ బ్రాండ్ ఫ్రాంచైజ్ కి ఇస్తామని, నెలకు రూ.35 వేల జీతం కూడా ఇస్తామని నమ్మించారు. వీరి మాటలు నమ్మిన కొందరు పుస్తెలు తాకట్టు పెట్టి మరీ ఫ్రాంచైజ్ లు తీసుకొన్నారు. ఇలా వసూలు చేసిన సొమ్ముతో వారు పరారయ్యారు. బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
యూట్యూబ్ ఫ్రాంచైజీ పేరుతో రూ. 3 కోట్లు వసూలు..పరారీ
బ్యూటీ పార్లర్ పేరుతో ఫ్రాంచైజ్ లు ఇస్తామంటూ...
