మంగళగరి, నవంబర్ 3: తెలుగు నేలకు ప్రాణాధారమైన కృష్ణానది నేడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలకుల (CM Jagan) నిర్లక్ష్యవైఖరితో ప్రాభవంకోల్పోయిందని, పట్టించుకోవాల్సిన వారే అచేతనావస్థలో ఉండటంతో కృష్ణమ్మ వెలవెలబోయిందని మంగళగరి (Mangalagiri)లోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం (నవంబర్ 3) జరిగిన మీడియా సమావేశం (Nilayapalem Vijaykumar Press meet)లో టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ (TDP Nilayapalem Vijay Kumar) అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణకు గతంలో కేటాయించిన కృష్ణా నదీ (Krishna River) జలాల వినియోగాన్ని పున:పరిశీలించాలని తాజాగా కేంద్రప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ (Brijesh Kumar Tribunal )ను ఆదేశించినా, ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం బాధాకరమని ఆయన అన్నారు. సుప్రీంకోర్టుతో సంబంధం లేకుండా ఏపీ–తెలంగాణ నీటి కేటాయింపుల (Water Dispute Between Telangana and Andhra Pradesh) సమస్యను బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ఎలా పరిష్కరిస్తుంది.. అసలు ఆ దిశగా కేంద్రం ఎలా ఆదేశాలిచ్చిందని ఆయన (TDP Nilayapalem Vijay Kumar Flagged on CM Jagan) ప్రశ్నించారు.
సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న 5 స్పెషల్ లీవు పిటిషన్లు
అంతరాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టం -1956లోని, ఆర్టికల్స్ 3, 5 కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణాజలాల కేటాయింపులపై, గోదావరి జలాలకు సంబంధించిన అదనపు నీటి మళ్లింపుపై సమీక్ష జరిపి, వాటిని పంపిణీ లేదా కేటాయింపు చేయాలని కేంద్రప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌ను గత నెలలో ఆదేశించింది. 2013లో రాష్ట్రానికి జరిగిన నీటి కేటాయింపుల్లోనే ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని గతంలోనే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేయడం జరిగింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ (TDP) కూడా నీటికేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరతూ మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేసింది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులకు సంబంధించిన అవార్డు అమలైతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా ఏపీలో ని రాయలసీమ, ప్రకాశంజిల్లాలోని కొన్నిప్రాంతాలు ఎడారిగా మారే అవకాశముందని చెప్పడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలకు తాత్కాలికంగా జరిపిన కృష్ణా జలాల కేటాయింపులపై పున:సమీక్ష చేయాలని తెలంగాణ కూడా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. కర్ణాటక, మహారాష్ట్రలు కూడా పిటిషన్లు వేశాయి. మొత్తంగా 5 స్పెషల్ లీవు పిటిషన్లపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కు విచారణపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ పెండింగ్‌లో ఉంది.
Also Read: YCP Samajika Sadhikara Yatra: ‘వైసీపీ సాధికార యాత్రలో న్యాయం లేదు..’ జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్

అత్యున్నత న్యాయస్థానంలో వివాదం అపరిష్కృతంగా ఉండగానే కేంద్రప్రభుత్వం, బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కేవలం తెలంగాణ, ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణాజలాలపైనే సమీక్ష చేయాలని చెప్పడం దేనిలో భాగమనుకోవాలి? కేంద్రప్రభుత్వం తెలంగాణపక్షం వహించి ఏపీకి అన్యాయం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. 2013లో తెలంగాణ-ఏపీ నీటికేటాయింపులపై బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చినతీర్పుని సుప్రీంకోర్టుతో సంబంధంలేకుండా ఎలా మారుస్తారని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాం? బచావత్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ల విషయం తేలకుండానే కేంద్రం కొత్తగా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కు నీటికేటాయింపులపై సమీక్ష చేసే అధికారం కట్టబెట్టడం ఎంతమాత్రం చట్టబద్ధం కాదు. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ అభిప్రాయపడుతున్నట్టుగా ఏపీకి ఎప్పుడూ 2,575 టీఎంసీలు కాదుకదా.. దానిలో సగం నీరు కూడా అదనంగా పై ప్రాంతాల నుంచి రాలేదు. ఏపీలోని ప్రాజెక్టులన్నీ ప్రధానంగా మిగులు జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన మిగులు జలాల్లో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలని చెప్పడం నిజంగా బాధాకరం. మిగులు జలాలపై ఏపీకి ఉన్నహక్కులు మొత్తం హరించేలా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ వ్యవహరిస్తోంది.
తెలంగాణ మీదుగా కృష్ణాజలాలు ఏపీకి తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ నేడు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఎందు నోరెత్తడం లేదు?
కృష్ణాజలాలపై ఏపీకి ఉన్న వాటాపై గట్టిగా నిలదీయాల్సిన పాలకులు మిన్నకుండిపోయారు. కేవలం మొక్కుబడిగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. గతంలో జలదీక్షలు చేసిన జగన్ నేడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. రాష్ట్రప్రయోజనాలకోసం అన్నిరాజకీయపార్టీలు.. రైతులు..రైతుసంఘాలతో చర్చలు జరిపి, రాష్ట్రప్రయోజనాల పరిరక్షణకోసం ఎలా ముందుకెళ్లాలో ఆలోచించరా? నవంబర్ 22, 23 తేదీల్లో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు జరగనున్నాయి. ఆ వాదనల్లో రాష్ట్ర ప్రభుత్వం గొంతు సమర్థవంతంగా వినిపించకపోతే అంతిమంగా నష్టపోయేది రాష్ట్రమే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట సరైన వాదనలు వినిపించకుండా రాష్ట్రప్రయోజనాలు దెబ్బతీసింది. అధికారానికి వచ్చిన కొత్తల్లో కేసీఆర్ తో అంటకాగి.. తెలంగాణ భూ భాగం మీదుగా ఏపీకి కృష్ణాజలాలు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ (CM Jagan).. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ఎందుకు నోరెత్తడం లేదు? కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తుని 514 నుంచి 524 మీటర్లకు పెంచడానికి అనుమతులు ఇచ్చినా సీఎం జగన్ స్పందించడం లేదు.
తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్‌లను కూడా సీఎం పట్టించుకోవడం లేదు. అప్పర్ తుంగ..అప్పర్ భద్ర..సింగటూరు ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా రాయసీమ (Rayalaseema)కు జరిగే నష్టం జగన్‌కు కనిపించడం లేదా? రాష్ట్రంలోని కరువు మండలాలు కూడా సక్రమంగా గుర్తించలేని సీఎం జగన్.. రాబోయే కరువుని ముందే పసిగట్టి.. రైతాంగాన్ని కాపాడలేని ఈ అసమర్థ సీఎం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాలు సాధిస్తాడా? ఏపీ, తెలంగాణకు చెందిన కృష్ణజలాలపై పున:సమీక్ష చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం పూర్తిగా అసంబద్ధం జగన్ స్వప్రయోజనాలకోసం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణాజలాలను వదిలేస్తానంటే టీడీపీ చూస్తూ ఊరుకోదంటూ హెచ్చరించారు.
నదీ జలాల కేటాయింపులపై సమీక్ష చేసే అధికారాన్ని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కు కట్టబెట్టడమే చట్టవిరుద్ధం. అంతరాష్ట్ర నదీజలాల వివాదపరిష్కార చట్టం 1956ను కేంద్ర ప్రభుత్వం 2002లో సవరించింది. సవరించిన చట్టంలోని సెక్షన్ -4, ఆర్టికల్ 2 ప్రకారం 2002కు ముందున్న నదీజలాల అవార్డ్స్ ను కొత్తగా వచ్చే ట్రైబ్యు నల్స్ సమీక్ష చేయకూడదనే నిబంధన ఉంది. బచావత్ ట్రైబ్యునల్ నీటి కేటాయిం పులకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు డిక్రితో సమానమైనవి. అలాంటి ఆదేశాలపై సమీక్ష చేసే అధికారం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌కు లేదు. పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణాడెల్టాకు తరలించే గోదావరి నీటిలో వాటా అడుగుతున్న తెలంగాణ .. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 213 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాబేసిన్ లో కలుపుతున్నప్పుడు ఆ నీటిలో కూడా ఏపీకి వాటా ఇవ్వాలనే వాదనను బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట కేంద్రం ఎందుకు ఉంచలేదు? గోదావరి-కృష్ణా జలాల్లోనే పనిగట్టుకొని ఏపీకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? జగన్ సర్కార్ ఇతరపార్టీలను కలుపుకొని నీటి వివాదాలపై కేంద్రప్రభుత్వంతో ఎందుకు సంప్రదింపు లు జరపడం లేదు? నేడు జగన్ అధికారంలో ఉండొచ్చు..రేపు మరొకరు ఉండొచ్చు.. కానీ రాష్ట్రానికి అన్యాయం చేయడం, భవిష్యత్ తరాలకు తీరని ద్రోహం చేయడం.. రైతాంగాన్ని వంచించడం ఎంతమాత్రం సరైన విధానం కాదని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.

7 Comments
Comments are closed.