ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని యూనిసెఫ్ ఫీల్డ్ ఆసిస్ చీఫ్ జెలాలెం బీ టఫాస్సె ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గ్రామీణ స్థాయి పరిపాలన చక్కగా కొనసాగుతుందని ఈ సందర్భంగా జెలాలెం బీ టఫాస్సె అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వైద్య, ఆరోగ్య రంగంలో వివిధ స్థాయిల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
ఏపిలో వివిధ రంగాల్లో జగన్ సర్కార్ తీసుకుంటున్న అభివృద్ది పనులపై చర్చించారు. ఆశా, అంగన్వాడి వర్కర్స్, ఏఎన్ఎంలు, హెల్త్ అండ్ వెల్పేర్ సెంటర్స్ లాంటి వివిధ స్థాయిల్లో ప్రభుత్వానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించేందుకు యునిసెఫ్ ముందుకు వచ్చింది. ఆరోగ్య సురక్ష పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధన గురించి వివరించిన తీరు యునిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ అభినందించారు.
చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. వారికి అందిస్తున్న పౌష్టికాహారం, యాక్షన్ ప్లాన్, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం లాంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయం అందిస్తామని యూనిసెఫ్ టీమ్ తెలిపారు.
