Ys jagan: ప్యాలెస్ లో జగన్ సడెన్ మీటింగ్, రెండేళ్ళ పాలనే టార్గెట్ గా..?

ఏపీలో దూకుడు పెంచేందుకు వైసీపీ రెడీ అవుతోందా..?

Share this :

ఏపీలో దూకుడు పెంచేందుకు వైసీపీ రెడీ అవుతోందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు ఒక కీలకమైన అత్యున్నత స్థాయి సమావేశానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కీలక సమావేశం జరగనుంది.

Also Read: Supreme Court: కాక్రోచ్ పార్టీపై పిటిషన్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు..!

ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు (MP), పార్లమెంట్ కోఆర్డినేటర్లు, శాసనసభ్యులు (MLAs), అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మరియు శాసనమండలి సభ్యులు (MLCs) సహా పార్టీకి చెందిన అగ్రశ్రేణి నాయకత్వం, కీలక ప్రజాప్రతినిధులు అందరూ తప్పనిసరిగా హాజరుకానున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే ఈ సుదీర్ఘ సమావేశంలో ప్రధాన అజెండాగా సాగనుంది. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక, గ్రామ మరియు వార్డు స్థాయిలో పార్టీ పట్టును నిరూపించుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతలతో చర్చించనున్నారు.

దీనితో పాటు, పార్టీకి అత్యంత కీలకమైన ఎస్‌ఐఆర్ (SIR) అంశంపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. ఎన్నికల సమరానికి కేడర్‌ను సమాయత్తం చేయడంతో పాటు, బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల పునర్నిర్మాణం మరియు సంస్థాగత మార్పులపై ఈ వేదికగా ఒక తుది నిర్ణయానికి రానున్నారు. మరోవైపు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైన హామీలు, వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

Also read: Kesineni Chinni: ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ..!

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలు, మరియు శాంతిభద్రతల అంశాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ఏ రకమైన పోరాటాలు చేయాలనే దానిపై లీడర్లకు టాస్కులు అప్పగించనున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత బలోపేతం చేయడం, వైఎస్సార్‌సీపీ వాయిస్‌ను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు అవసరమైన కొత్త రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అటు సోషల్ మీడియా వేదికగా, ఇటు ప్రత్యక్ష పోరాటాల ద్వారా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు.

leave a reply