క్రికెట్ అంటే చిన్నా పెద్ద ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో చూస్తుంటారు. ప్రపంచంలో ఎన్ని రకాల క్రీడలు ఉన్నా.. క్రికెట్ స్థానం వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇక క్రికెట్ అంటే భారత్ – పాక్ ల మద్య జరిగే మ్యాచ్ యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. తాజాగా అందరూ ఎదురు చూస్తున్న భారత్ – పాక్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో ఈ రెండు దేశాల మధ్య సమరం మొదలు కాబోతుంది. దాయాదుల సమయరం కోసం ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇక గెలుపు పై ఎవరి ధీమా వారికి ఉంది.
ఇప్పటికే పాకిస్థాన్.. నేపాల్ పై భారీ విజయం సాధించి మంచి ఉత్సాహం.. ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు భారత్ సైతం విజయం పై పట్టుదలతో ఉంది.. మొత్తానికి తమ బలాబలాలపై ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్లు గ్రూప్ – ఏ లీగ్ మ్యాచ్ లో అమీ తుమీకి సిద్దమయ్యారు. ఈ మ్యాచ్ కు శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదిక కాబోతుంది. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. పాకిస్థాన్ ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని.. కొంతకాలంగా ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో బాగా రాటు తేలిందని గుర్తు చేశారు. ఏమిదేళ్ల కిందట ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని బాగా బలం పెంచుకున్నారని అన్నారు.
