ఆ కారణంతో ఏపీ టీచర్ల జీతాలు ఆలస్యం : బొత్స సత్యనారాయణ

Share this :

ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో టీచర్ల జీతాల ఆలస్యంపై నెట్టింటా తెగ విమర్శలు వినబడుతున్నాయి. ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రధాన ప్రతిపక్షం సోషల్ మీడియాలో సైతం వైరల్ చేస్తుంది.  అయితే దానికి సంబంధించి అసలు ఎందుకు ఆలస్యం అయింది అనే దానిపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఐనటువంటి బొత్స సత్యనారాయణ గారు వివరంగా చెప్పారు.

కొంతమంది కావాలని రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీచర్లకి జీతాలు క్రెడిట్ అవ్వకపోవడానికి కారణం సాంకేతిక లోపం అని దాని వల్లే వారికీ జీతాలు ఆలస్యం అయ్యాయని చెప్పుకొచ్చారు.అయితే ఈ నెల 7 లేదా 8వ తారీఖుల్లో వారందరికీ వారి వారి అకౌంట్స్ లో జీతాలు జమ అవుతాయని అన్నారు.

ఈరోజు వైజాగ్లోని ఏయూ కన్వెన్షన రాష్ట్ర గురుపూజోత్సవం కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమానికి ఆయనే చీఫ్ గెస్ట్ గా వచ్చి రాష్ట్రంలో ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జీతాల విషయం పై క్లారిటీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం ఐనా ముత్యాల నాయుడు గారు మరియు ఐటీశాఖమాత్యులు ఐనటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఉన్నారు.