మళ్ళీ జగన్ వస్తే మన ఇంటి పత్రాలను కూడా తాకట్టు పెడతాడు

Share this :

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి యాత్ర దిగ్విజయంగా జరిపిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నట్లు ఇటీవల మీడియా వేధికగా తెలిపిన విషయం తెలిసిందే. ఇక జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాు.

తిరుపతి మరియు శ్రీకాళహస్తి నాయకులతో కార్యకర్తల సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిస్థితులు అందరూ గమనిస్తున్నారు. జగన్ సర్కార్  నిరంకుశ పాలనను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే జగన్ ను ఎదుర్కోగలం. రాబోయేది జనసేన, టిడిపి ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. పది సంవత్సరాలు వేచి ఉన్న కార్యకర్తలు ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించండి మీకు మంచి భవిష్యత్తు మునుముందు రానుంది అని గుర్తుపెట్టుకోండి అన్నారు. 

పార్టీలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి ధర్మో రక్షిత రక్షితః పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అయితే.. ధనమో రక్షిత రక్షితః జగన్  సిద్ధాంతం. వ్యవస్థ లను పోలీసు అధికారులను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా అధికారులకు ఆరు నెలలు సమయం ఇస్తున్నాం వారు పద్ధతులను మార్చుకోకపోతే రాబోయే రోజులలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.  రాష్ట్రంలో భూకబ్జాలు రౌడీయిజ దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి.. మరొకసారి జగన్ ప్రభుత్వం వస్తే మన ఇంటి పత్రాలను కూడా జగన్ తాకట్టు పెట్టుకుంటాడు అని అన్నారు. 

 పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా మనందరం కట్టుబడి ఉండాలి. వచ్చే ఎన్నికల్లో జనసేన, టిడిపి గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ , NRI కో-ఆర్డినేటర్ శశిధర్ ,జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి శ్రీకాళహస్తి ఇన్చార్జి వినీతకోట , రీజినల్ కో ఆర్డినేటర్ వనజ, కీర్తన మరియు రాష్ట్ర జిల్లా పట్టణ కమిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.