షుగర్ సమస్య ఉన్నవాళ్లు సీతాఫలం తినవచ్చా…??

Share this :

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి ఆరోగ్యం పరంగా ప్రజలను పట్టీ పీడిస్తున్న సమస్యల్లో ఒకటైనది షుగర్ సమస్య. అయితే వరల్డ్ లోనే ఎక్కువగా మన ఇండియా లోనే దీని బారిన పడిన వాళ్ళు ఉన్నారు. సహజంగా షుగర్ అనేది ఒక వ్యాధి కాదు అది ఒక అనారోగ్య సమస్య దాని ప్రభావం అనేది ఒక రోజులో తెలీదు కాకపోతే ఒక్కసారీ వచ్చిందంటే జీవితాంతం మన యొక్క నిరోధక శక్తి తగ్గిస్తూనే ఉంటుంది.ప్రస్తుతం ఈ సమస్య అనేది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా అందరికి వస్తుంది. అలాగే తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది.

ప్రస్తుతం మనం ఉన్న బిజీ లైఫ్ రీసన్ వల్ల మన ఫుడ్ మెనూ ను మనం మనకి తెలియకుండానే మార్చుకుంటూ పోతున్నాం. మార్కెట్ లో దొరికే ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల మన లైఫ్ ను మనమే నాశనం చేసుకుంటున్నాము.అయితే డయాబెటీస్ లో భాగంగా కొన్ని రకాల ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి అని కొంతమంది నిపుణులు సూచనలు ఇస్తున్నారు.లేదంటే చివరికి అది మరణానికి దారి తీస్తుంది.అయితే అందులో సీతాఫలం తినాలా? వద్దా? అని కొంతమందిలో చాలా కాలంగా అనుమానం ఉంది.

మాములుగా సీతా ఫలాలు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అది రుచికి ఎంతో తియ్యగా ఉంటాయి. వాటిని చూడగానే అందరికి తినాలనిపిస్తుంది. అది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే అవి మనకు సీజనల్ గా దొరికే పండ్లు కాబట్టి. వాటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్ బి6, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉంటాయి. అలాగే సీతా ఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల షుగర్ సమస్య ఉన్నవాళ్లు ఎటువంటి భయం లేకుండా తినవచ్చు అని నిపుణులు అంటున్నారు.ఇంకా సీతా ఫలంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లెమ్ ఉన్నవారు,లావుగా ఉన్నవారు, పాలిసిస్టిక్ ఓవరీ సండ్రోమ్ తో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఎటువంటి భయం లేకుండా తినవచ్చు.

ఇంకా దీని వల్ల అరుగుదల సమస్యలు, మలబద్ధకం సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ వంటి వాటిని కూడా అదిగమించవచ్చు. అలాగే మన కంటి సమస్యల నుండి కూడా మెరుగు పరుస్తుంది.హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్త ప్రసారణ్ణి మంచి కండిషన్ లో ఉండేట్లు చూస్తుంది.ఇవన్నీ మనకు నిపుణులు ఇచ్చిన సమాధానాలు కనుక వీటిని తినడంలో ఇబ్బంది ఉండదు ఇంకేమైనా సందేహాలు ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ముందుకు సాగాల్సింది మనవి.