లోబీపీ ఉన్నవారికి అలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

Share this :

ప్రస్తుత సొసైటీ లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ప్రజలకి బీపీ సమస్య అనేది ఎక్కువగా ఉంది.అయితే ఈ సమస్య ఉన్నవారిలో ఎక్కువగా కనబడే సమస్యలు తరచుగా తల తిరగడం,తలనొప్పి వంటివి కనబడుతూ ఉంటాయి.అయితే లోబీపీ ఉన్నవారికి తల తిరగడానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే ఆలోచన చాలా మందిలో ఉంది. అయితే దాంట్లో భాగంగా రక్తపోటు తగ్గిన తర్వాత శరీర కార్యకలాపాలు అనేవి మందగించడం స్టార్ట్ అవుతాయి.

అయితే లోబీపీ ఉన్నవారికి తల తిరగడానికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే ధమనులలో ఒత్తిడిని కొలిచే సిస్టోలిక్ పీడనం పైన ఇది కనిపిస్తుంది.దీని వలన గుండె కొట్టుకుంటూ ఉంటుంది.అలాగే తక్కువ సంఖ్య డయాస్టొలిక్ ఒత్తిడిని పెంచుతుంది.అలాగే ధమనులలో ఒత్తిడి పెరుగుతుంది.సాధారణం గా బిపి 90/60 mmHg, 120/80 mmHg మధ్యలో ఉంటుంది. అయితే బీపీ తక్కువగా ఉన్నప్పుడు తల తిరిగితే ఏం చేయాలి ముందుగా అతనికి ఉప్పు నీళ్లు ఇవ్వాలి.ఎందుకంటె అది మన బ్రెయిన్ ను యాక్టివ్ మోడ్ లోకి తీస్కొని వస్తుంది.అదే సమయంలో ఇది రక్తాన్ని పంపు చేయడానికి కూడా పని చేస్తుంది. తర్వాత శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.

దానితోపాటు వారికీ వేడి పాలు లేదా కాఫీ ఇవ్వాలి అప్పుడు తొరగా బీపీ పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే బిపి తక్కువగా ఉన్నప్పుడు మీకు కళ్ళు తిరుగుతున్నట్లుకూడా అనిపిస్తుంది ఆ టైం లో వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బీపీ సమస్య అనేది త్వరగా దూరం అవుతుంది.అనిపిస్తే ఈ రెండు పనులు కచ్చితంగా చేయాలి.