అమరావతి, అక్టోబర్ 20: ఒకప్పుడు ప్రజల నుంచి ఓట్లు రాబట్టేందుకు రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్లి వాళ్లతో మమేకమయ్యేవారు. వారి పనుల్లో పాలు పంచుకునేవాళ్లు. వాళ్ల కష్టనష్టాలు తెలుసుకుని అందుకు అనుకూలమైన సంక్షేమ పథకాలు (Welfare Schemes) ప్రవేశపెడతామని హామీలిచ్చేవారు. ఓటర్ల మనసులు గెలుచుకోవడానికి తాము బానిసలుగా మారేవారు. కానీ నేడు ఆ ‘నాగరిక వ్యవస్థ’ కనుమరుగైంది. ప్రజాస్వామ్య సమాజంలోని వ్యవస్థలను, సంప్రదాయాలను తారుమారు చేస్తున్నారు. రాజకీయ (Andhra Pradesh)ప్రత్యర్థులను అవమానించడం, విషపూరిత పదజాలంతో కించపరడచం, అవమానకరంగా వ్యక్తిగత విమర్శలకు దిగడం, రాజకీయ పోరా ట యోధుల మధ్య విద్వేషపూరితమైన శత్రుత్వాన్ని పెంచడం (AP Political Trends) అనివార్యమైపోయింది. ఎన్నికల్లో గెలిచేందుకు (AP Upcoming Elections) హింస కేంద్రంగా ప్రచారం సాగుతోంది. బ్యాలెట్ బాక్స్ (ballot box) వద్ద ఓట్ల వర్షం కురిపించేందుకు దొడ్డిదారులు వెతుకుతున్నారు.
దిగజారుతోన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో హింసాత్మక రాజకీయ సంస్కృతి (brutally violent political culture) నడుస్తోంది. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం, హింసాత్మక పదజాలం వినియోగించడం ఆయా పార్టీల కార్యకర్తలకు అనివార్యమవుతుంది. ఎన్నికలకు విడుదల చేసే మ్యానిఫెస్టో (Manifesto)లు సైతం స్లగ్‌ఫెస్ట్‌లుగా నిలుస్తున్నాయి. ఆ మధ్య వైఎస్ జగన్‌మోహన్ (AP CM YS Jagan Mohan Reddy) రెడ్డి భార్య వైఎస్ భారతి (YS Bharathi) గురించి ఓ రాజకీయపార్టీ తమ అనుకూల పత్రికలో తప్పుడు రాతలు రాసి అసభ్యంగా ప్రచారం చేసింది. వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)లో అరెస్ట్ అయిన వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy Arrest)కి భారతికి సంబంధం అంటగట్టి అసభ్య రాతలు రాశారు. అవినాష్ రెడ్డి, భారతి ఇద్దరూ వరుసకు బావమరదళ్లని, జగన్ పిల్లలిద్దరూ అచ్చం అవినాష్ పోలికలతో పుట్టడం దేవుడి స్ట్కిప్ట్ అంటూ.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంతి సీఎం జగన్ సతీమణి గురించే పిచ్చిరాతలు రాశారంటే ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంత భ్రష్టుపట్టాయో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అదేపంథాలో నారా చంద్రబాబు కోడలు, నారా లోకేష్ భార్య బ్రాహ్మణీ గురించి ఓ రాజకీయ పార్టీ నీచాతినీచంగా రాయించి.. కనీస విలువలు పాటించని పత్రికల్లో పబ్లిష్ అయినట్లు క్లిప్పింగ్స్ చేయించి సర్క్యులేట్ చేస్తున్నారు.

నారా చంద్రబాబు కోడలిపై ఎందుకీ అసభ్య రాత కోతలు?
ఆ పత్రికలో.. హైదరాబాద్‌లోని తమ ఫామ్ హౌస్ (Farm house in Hyderabad)లో నాలుగో ప్రియుడితో బ్రాహ్మణి (Nara Brahmani) రాసలీలలు అంటూ చంద్రబాబు (Nara Chandra Babu) కోడలి గురించి వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రియుడి విషయంలో అత్తారింట్లో గొడవలు జరగడంతో అలిగి ఫాం హౌస్‌కు వెళ్లిపోయిందని, అక్కడే చాన్నాళ్లు ఉందని, ప్రియుడు తరచూ అక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవారని.. రామోజీ (Ramoji Rao), రాధాకృష్ణ (Radhakrishna) నచ్చజెప్పడంతో బ్రాహ్మణి మనసు మార్చుకుని భర్త లోకేష్ (Nara Lokesh) వద్దకు వెళ్లిందనేది ఆ వార్త సారాంశం. అయితే ఇటీవల లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిందని.. ఈ సమయం అంతా ప్రియుడితో జల్సాలు చేసిందని, లిక్కర్ స్కామ్ (Liquor scam)లో వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుందంటూ.. గుట్టుగా కాపురం చేసుకునే బ్రాహ్మణిని రాజకీయ లబ్ధి కోసం ఇలా నగుబాటు చేస్తున్నారు. ఈ విషయమై అత్త భువనేశ్వరి (Nara Bhuvaneswari)తో గొడవలు ఉన్నాయని, తాజాగా వీరిద్దరూ కలిసిపోయారంటూ కుటుంబ వ్యవహారాలను కూడా రాజకీయం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. త్వరలో పార్ట్ -2 కూడా బయటపెడతామంటూ సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు (Paid promotions) చేయిస్తున్నారు. బ్రాహ్మణి అటు నటుడు బాలకృష్ణ కూతురు కావడం, ఇటు చంద్రబాబు కోడలు కావడంతో రాజకీయాలతోపాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ప్రత్యర్ధుల కుటుంబాల్లోని ఆడవారిని రచ్చకీడ్చి.. దిగజారుడు రాజకీయాలు అవసరమా?
ఏపీ రాజకీయాలు మరీ ఇంతగా దిగజారడం పట్ల కొందరు సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టడం కోసం నేతలు మరొక అడుగు ముందుకేసి మతకల్లోలాలు (Religious riots) సృష్టించడం, ఇరుపక్షాలు దాడులకు దిగడం, ప్రత్యర్ధుల కుటుంబాల్లోని ఆడవారి గురించి అసభ్య కరంగా రాతకోతలు, నీచమైన చర్చలు సాగించడం నీచ రాజకీయాల (Grammar of violence)కు పరాకాష్టగా మారిందంటున్నారు. బాంబులు విసిరి అమాయ ప్రజలను హతమార్చడం నుంచి సామాజిక మాధ్యమాల్లో (social media) నకిలీ న్యూస్ (Fake News) సృష్టించి ప్రచారసాధనాలు (social media volunteers)గా వాడుకుంటున్నాయంటున్నారు. రాజకీయ పదవులు అలంకరించాలంటే అసభ్య పదజాలాన్ని (foul language) ఆశ్రయించడం ఒక్కటే మార్గం అనే స్థాయికి దిగజారిపోయారని భావిస్తున్నారు.
ఓటర్లను తప్పుడు దారిలోకి మళ్లించేందుకు నేతల విఫలయత్నం
నిజానికి.. ఒక పార్టీ ఇలాంటి తప్పులు దారులను ఆశ్రయించిందంటే ఆ రాజకీయ పార్టీ పోరాట పటిమ కోల్పోయిందని అర్థం. ‘హింస’ రాజకీయ నాయకుల వ్యూహంగా మారితే ప్రజా సమస్యలు చర్చించేందుకు చట్టసభల్లో కూడా చోటుదక్కదు. కుల రాజకీయాలు, మత రాజకీయలు, హింసా రాజకీయాలకు ఆజ్యం పోసి పెంచుతున్నప్పుడు, భవిష్యత్తు పబ్లిక్ పాలసీ (Public Policies)కి ఎలాంటి ప్రాధాన్యత లేనప్పుడు.. ఓట్లు అడిగే హక్కు వీరికి లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఓట్లు అడిగే పద్ధతి ఇదేనా? అంటూ కన్నెర్ర చేస్తున్నారు. నేతల పోకడ ప్రజల్లో భయాలు, అభద్రతను సృష్టిస్తున్నాయి. ఓటర్లు నిజమైన సమస్యలు మరచిపోయేలా పక్కదారి పట్టిస్తున్నారు. ఇదెక్కడి రాజకీయం.. ఈ రోత రాజకీయం అవసరమా? మరీ ఇంతగా దిగజారాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో (AP Political Parties) ఐఏఎస్ (IAS)లు, డాక్టర్లు (Doctors) వంటి పెద్ద పెద్ద చదువులు చదివినవారు ఉన్నారు. వారి పార్టీల సంస్కారం ఇదేనా? ఓట్ల కోసం, రాజకీయాల కోసం ఈ స్థాయికి దిగజారడం అవసరమా? దీని వల్ల ఓట్లు రావు. ఈ సంప్రదాయం తప్పు. రాజకీయాలు ఇంత బ్రష్టుబట్టిపోతే భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. తెగే వరకు లాగితే ఏంటి ప్రయోజనం. ప్రత్యర్ధుల ఇళ్లలోని మహిళలను రోడ్లమీదకి లాగితే ఓట్లు వస్తాయనుకోవడం, ప్రజల్లో సానుభూతి కోసం ఎంతవరకైనా దిగజారడం పశుసంస్కృతికి చిహ్నాలు. ప్రజల నుంచి ఓట్లు రాబట్టాలంటే సంక్షేమ పథకాల (Social Security Welfare Schemes) గురించి చర్చించాలని సామాజిక వేత్తలు హితం చెబుతున్నారు.
రాయకీయాలంటే ఇవేనా?
రాజకీయాలంటే (Grammar of violence).. సమాజ, దేశ సంక్షేమం కోసం చేసేవా? లేదంటే ప్రభుత్వంలో ఉండటం కోసం చేసేవా? అనే ప్రశ్నతలెత్తుతుంది. గతంలో రాజకీయాలు సామాజిక ఉద్యమంలో భాగంగా ఉండేవి. ఆ తర్వాత సమాజంలో మార్పు కోసం, దేశ అభివృద్ధి కోసం సాగుతూ వచ్చాయి. ప్రస్తుతం మాత్రం అధికారంలోకి రావడమే లక్ష్యంగా రాజకీయాలు సాగుతున్నాయి. నిజానికి సామాజిక, ఆర్థిక సంస్కరణలకు నిజమైన రాజకీయాలే సాధనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని నాయకులంతా సమాజ అభ్యున్నతి, విద్యాభివృద్ధి కోసం పనిచేయాలని మనవి.

Comments are closed.