Karnataka Crime News: ‘శుభలగ్నం’ సీన్ రిపీట్.. భర్తను రూ. 5 లక్షలకు వేరే మహిళకు అమ్మేసిన భార్య

నవ భారతం కథ.. మీరూ చదవండి

Share this :

మాండ్య, అక్టోబర్‌ 21: తెలుగు సినిమా శుభలగ్నం (Subhalagnam movie) గుర్తుందా? ఈ మువీలో హీరో జగపతిబాబు భార్య ఆమని డబ్బు కోసం భర్తను బేరం (Husband For Sale) పెడుతుంది. డబ్బుపై మోజుతో రూ.కోటికి భర్తను రోజాకు అమ్ముకుని మురిసిపోతుంది. క్లైమాక్స్‌లో డబ్బు కంటే మాంగళ్య బంధమే (Marriage) విలువైందని తెలుసుకుని ఎలాగోలా భర్తను దక్కించుకుంటుంది. సరిగ్గా అదే సీన్‌ రియల్‌ లైఫ్‌లో ఓ మహిళ జీవితంలోనూ రిపీట్‌ అయ్యింది. తన భర్తను వేరే మహిళకు ఏకంగా రూ.5 లక్షలకు విక్రయించింది. ఈ విచిత్ర ఘటన కర్ణాటక (Karnataka)లోని మండ్య (Mandya) సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. విషయమేమంటే…

Also Read: Actress Shruti Haasan in Politics: రాజకీయాల్లోకి స్టార్‌ హీరోయిన్ ఎంట్రీ? మరోసారి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

తన భర్త స్థానికంగా ఉండే వేరే మహిళ (local woman)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆ గృహిణి గ్రహించింది. ఓ రోజు రెడ్‌ హ్యాండెడ్‌గా గదిలో ఇద్దరినీ పట్టుకున్న సదరు భార్యామణి ఊరిపెద్దలను పిలిచి పంచాయితీ (panchayat) పెట్టించింది. అయితే ఇక్కడ ఊహించని ట్విస్ట్‌ బయటపడింది. బాధితురాలి భర్త తన వద్ద రూ.5 లక్షలు తీసుకున్నాడని, ఆ డబ్బు చెల్లించి ఆమె తన భర్తను తీసుకెళ్ల వచ్చని వివాహేతర సంబంధం (extramarital affair)పెట్టుకున్న మహిళ చెప్పుకొచ్చింది.

Also Read: Indecent Politics in AP: ఇదెక్కడి రాజకీయం..! ఓట్ల కోసం ఇంత దిగజారాలా..? సంస్కారం మరిచారా?

అయితే బాధిత మహిళ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ‘ఇలాంటి భర్త నాకు అక్కర్లేదని’ తెగేసి చెప్పింది. ‘రూ.5 లక్షల డబ్బు (Rs 5 lakhs) మనోవర్తిగా నువ్వే చెల్లించి.. నా భర్తను నువ్వే ఉంచుకోవాలని ఆ మహా ఇల్లాలు చెప్పడంతో ఊరి జనమంతా ముక్కున వేలేసుకున్నారు. అందుకు అంగీకరించిన మహిళ డబ్బు చెల్లించేందుకు నెల రోజుల గడువు కోరింది. మారుమాట్లాడకుండా గృహిణి వెంటనే తన అంగీకారం తెలిపింది. దీంతో కథ సమాప్తం. ఇక ఊరువాడంతా ఇదే చర్చ. ఆ ఇద్దరి మహిళల మధ్య కుదిరిన రాజీ ఒప్పందం చూసిన పంచాయితీ పెద్దలతో సహా గ్రామస్థులు ఇదెక్కడి చోద్యం అంటూ వెర్రిమొఖాలేశారు. ఇది అధునిక భారతం.. డబ్బు ముందు మానవ సంబంధాలు (importance of money in relationships) ఏవిధంగా వీగిపోతున్నాయనేందుకు ఇదొక ఉదాహరణ. ఇలాంటి విచిత్ర ఘటనలు దేశ నలుమూలలా ఇంకెన్ని వెలుగులోకొస్తాయో…!

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.