పశ్చిమ బంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐనా మమతా బెనర్జీ ఎమ్మెల్యేల జీతాలను ఒక్కసారిగా పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ్యుల జీతాలను నెలకు 40వేల రూపాయలు పెంచుతున్నట్లు ఆమె తెలిపారు.దీనికి సంబంధించి ఆమె బెంగాల్ శాసనసభలో ఒక ప్రకటన కూడా చేశారు.అయితే ఆమె చేసిన ప్రకటనలో ముఖ్యమంత్రి జీతంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపారు.
అయితే ఆమె చాలాకాలం నుంచి జీతం కూడా తీసుకోవటం లేదన్న విషయం అందరికి తెలిసిందే. అలా పెంచడానికి కారణం ఏంటంటే ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలతో పోలిస్తే పశ్చిమ బంగాల్ ఎమ్మెల్యేల జీతాలు బాగా తక్కువగా ఉన్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. ఆ కారణంగా ఎమ్మెల్యేల జీతాలు 40వేల రూపాయలు పెంచినట్లు తెలిపారు. 40వేల పెంపు తర్వాత భత్యాలు, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఆలోవెన్సెస్ తో కలిపి ఎమ్మెల్యేల మొత్తం జీతం ఎంతో మాత్రం చెప్పలేదు.
మన రాష్ట్ర శాసన సభ్యులు వారి కృషి కి మించి ప్రజలకు సేవలు చేస్తున్నారు. అది గమనించిన మమతా బెనర్జీ ఇలాంటి డెసిషన్ తీస్కుందని పార్టీ పెద్దలు అంటున్నారు. అయితే ‘మిగతా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతాలు బాగానే ఉన్నాయి కానీ మా రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు అంత జీతాలు ఇవ్వడం లేదు. అందుకే వేతనాలు పెంచాలని డిసైడ్ అయ్యాం దానికి గాను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రూ.40వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.’ అని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అన్నారు.
