ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక సంచలనం. ఈరోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఇంకా వాటి నుండి కోలుకొని రాష్ట్ర ప్రజలకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్న సంగతి ఏంటంటే రేపో మాపో లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతుంది.అయితే వైసీపీ నాయకులు దానితో ఆగకుండా ఇంకో అగుడు ముందుకేసి లోకేష్ తర్వాత అరెస్ట్ కాబోయేది జనసేన అధినేత అనే న్యూస్ తెగ చక్కెర్లు కొడుతోంది.
అయితే చంద్రబాబు అరెస్ట్ అనేది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనే ఒక కట్టుకధ న్యాయస్థానానికి చూపించి, వినిపించి అక్రమంగా ఆయన్ను జైలు పాలు చేసారు. నెక్స్ట్ అలాంటి ఒక కధ ను అల్లి ఎటువంటి సంబంధం లేని లోకేష్ ను కూడా అరెస్ట్ అనే పేరుతో జైల్లో ఉంచాలని వైసీపీ అధినేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు బనాయించి లోకేష్ ను అరెస్ట్ చేయాలనీ చూస్తున్నారు. దీనిపై ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులు వారికేదో ముందే తెలిసినట్లుగా నెట్టింట్లో ఇలాంటి ప్రచారాలు అపి వేయాలని టీడీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు.అయితే ఇదిలా ఉంటే కొత్తగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ కాబోతున్నారు అనే అంశం తెర పైకి తీసుకొచ్చారు. అయితే ఆయనను ఏ కారణం చూపి అరెస్ట్ చేస్తారో చెప్పండి అని నేటిజన్స్ అభిమానులు అలాగే జనసైనికులు అడుగుతున్నారు. ఆయన ఏ రకంగా కూడా అవినీతిలో లేడు అలాగే ఇప్పటిదాకా ఎటువంటి పదవి లో లేడు.అయినా సరే ఏదోఒక కేసు పెట్టి జైల్లోకి పంపుదాం అనుకుంటే మాత్రం రాష్ట్రం రావణకాష్టం అవుతుంది అని జన సైనికులు అంటున్నారు.
అక్టోబర్ నెల నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మలి విడత ‘వారాహి విజయ యాత్ర’ స్టార్ట్ చేయబోతున్నారు.అయితే ఈ యాత్రలోనే పవన్ కళ్యాణ్‌ని అరెస్టు చేస్తారా! అని సోషల్ మీడియా లో నేటిజన్స్ కు ఎదురవుతున్న ప్రశ్న..? అయితే ఇలాంటి వార్తల్లో వాస్తవం లేదనేది జనసైనికులు ఆన్సర్ బట్ ఒకవేళ ఎలాజరిగితే మాత్రం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం అంటున్నారు.
