నాసిరకం మద్యంతో జగన్ రెడ్డి మరణ మృదంగం: ఎంపీ రఘురామకృష్ణం రాజు

Share this :

గత ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తూ తమకు ఒక్క ఛాన్సు ఇవ్వాలని ప్రాదేయపడ్డ జగన్ మోహన్ రెడ్డి పాలన చేపట్టిన తర్వాత ప్రజల ఊసరు తీస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్ర ఆరోపణలు చేశారు.  నాణ్యత లేని మద్యాన్ని సేవించి ఎంతోమంది మద్యపాన ప్రియులు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈమద్యం చావులన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాయిస్తున్న మరణం మృదంగమే. మగవారి దగ్గర సొమ్ములు కొట్టేసి, మహిళలను విధవలు చేస్తున్న దుర్మార్గమైన పాలకులను క్షమిద్దామా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమాలితే అవకాశం ఇచ్చిన మనము కోరుకున్నది మహిళల వైధవ్యమేనా? అంటూ అంటూ నిలదీశారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని నాణ్యత లేని మద్యంపై ఉద్యమించేందుకు మహిళలు ఇప్పటికైనా మేల్కొనడం హర్షించదగ్గ పరిణామని పేర్కొన్నారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమే. అయినా మీ భర్తలు మీ మాట వినకుండా, మద్యం తాగాలనుకుంటే మరో ఆరు నెలలు ఆగమని చెప్పండి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు. నాణ్యమైన మద్యం సేవించిన వారు 30 ఏళ్ల తర్వాత శరీరంలోని అవయవాలు చెడిపోయి చనిపోతే, జగన్మోహన్ రెడ్డి నాసిరకమైన మద్యాన్ని తాగితే ఏడాదికే అవయవాలన్నీ చెడిపోయి టపా కట్టేస్తారని అన్నారు . తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగానే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లలో బిజీ ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడుకి ఎల్లుండి సుప్రీంకోర్టులో బెయిల్ లభించడం ఖాయం. ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో తాను అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. మళ్లీ ప్రజలు మోసపోవద్దు. మహిళలు ఇప్పటికే మేల్కొన్నారు. మగవారు మాడాలుగా మారిన మహిళలు రోడ్డెక్కి, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ… తెదేపా అధినేత సతీమణి నారా భువనేశ్వర్ కి, నందమూరి ఆడపడుచు నారా బ్రాహ్మణి కి అండగా నిలుస్తున్నారని కొనియాడారు.