తెలుగు చిత్ర పరిశ్రమలో అందరు కపుల్స్ లాగా కాకుండా డిఫరెంట్ గా ఉండే కపుల్స్ అంటే ఎవరైనా చెప్తారు వారే’ నరేశ్-పవిత్రా లోకేశ్ ‘ అని. దానికి కారణం లేకపోలేదు అదేంటంటే నరేశ్ మరియు పవిత్ర ఇద్దరు కూడా ఇంతకు ముందు పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన వాళ్లే. అయితే అలాంటి వాళ్లిద్దరూఇపుడు పెళ్లి చేసుకొని ఒకటై పోయారు. ఇటీవల వారి జీవితం ఆధారంగా ‘మళ్ళీ పెళ్ళి’ అనే ఒక సినిమా కూడా తీశారు.
రానున్న వినాయక చవితి సందర్భంగా బుల్లితెర లో ఒక ఎంటర్టైన్మెంట్ షో టెలికాస్ట్ కాబోతుంది.అయితే దాంట్లో నరేశ్-పవిత్రా లోకేశ్ జంటగా కలిసి కనువిందు చేయబోతున్నారు.వారిద్దరూ కలిసి ఆ స్టేజీపై ‘మాస్టారూ మాస్టారూ’ అనే సాంగ్ కు డ్యాన్స్ చేయడంతోపాటు ముద్దులు కూడా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఒకరికొకరు వాళ్ళు ఏమని పిలుచులుకుంటారో కూడా చెప్పారు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ మద్య రిలీజ్ అయిన మళ్లీ పెళ్లి మూవీలో భాగంగా పవిత్రని నరేష్ అమ్ములు అని సంబోదించడం తెలిసిందే. ఇక పవిత్ర.. నరేష్ ని రాయా అని పిలిచింది. ఇలా ఒకరినొకరు తమ ఇష్టమైన పేర్లతో పిలవడం వారి మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉందో అర్థం అవుతుంది. వల్ల వారిద్దరూ సోషల్ మీడియాలో ఇంకోసారి హాట్ టాపిక్ గా మారిపోయారు.
